కలశజ్యోతుల ఉత్సవం శోభాయమానం - దుర్గామల్లేశ్వర స్వామి ఆలయానికి పోటెత్తిన భక్తజనం - Bhavani Deekshas in AP
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 27, 2023, 3:01 PM IST
Kalasa Jyothi Festival in Vijayawada : విజయవాడ దుర్గామల్లేశ్వరస్వామి ఆలయంలో భవానీదీక్షదారుల కలశజ్యోతులు ఉత్సవం శోభాయమానంగా జరిగింది. రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన భవానీ దీక్షాదారులు జగన్మాత దుర్గమ్మకు పూజలు చేసి కానుకలు సమర్పించారు. అనంతరం కలశజ్యోతులను గురు భవానీలు, అర్చకులు వెలిగించారు. భవానీలు, మహిళలు కలశజ్యోతులతో గాంధీనగర్, ఏలూరు రోడ్డు, పోలీసు కంట్రోల్‌రూం, కెనాల్ రోడ్డుపై వంతెన మీదుగా ఊరేగింపుగా కనకదుర్గానగర్‌లోని ఆలయానికి చేరుకున్నారు. భక్తులు అందరూ భవానీనామ స్మరణ చేస్తు ఊరేగింపుగా వెళుతుంతే అక్కడి వాతావరణం కన్నుల పండువలా మారింది.
Bhavani Deekshas in AP : అక్కడ జ్యోతులను సమర్పించిన భవానీలు మెట్ల మార్గంలో దుర్గమ్మను దర్శించుకున్నారు. అమ్మవారి దర్శనం కోసం భక్తులు పోటెత్తారు. చిన్న, పెద్ద అనే తేడా లేకుండా ఊరేగింపు ఉత్సవంలో భారీగా పాల్కొన్నారు. దేవస్థానం పాలకమండలి ఛైర్మన్ కర్నాటి రాంబాబు, ఈవో రామారావు, ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, వెలంపల్లి శ్రీనివాసరావు, విజయవాడ నగర మేయరు రాయని భాగ్యలక్ష్మి తదితరులు కలశజ్యోతుల ఊరేగింపును ప్రారంభించారు.