Kadapa SI Jeevan Reddy Attack on Real Estate Businessman Venkata Rao: కడప ఎస్ఐ జీవన్‌రెడ్డి నుంచి ప్రాణాహాని ఉంది: రియల్ ఎస్టేట్ వ్యాపారి - si jeevan reddy warning to nallaballe venkata rao
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 28, 2023, 12:22 PM IST
Kadapa SI Jeevan Reddy Attack on Real Estate Businessman Venkata Rao : వైఎస్సార్ జిల్లా కమలాపురం మార్కెట్ యార్డు సమీపంలో ఓ హోటల్లో భోజనానికి వెళ్లిన తనపై కడపకు చెందిన ఎస్.ఐ. జీవన్ రెడ్డి దాడి చేశారని ఎర్రగుంట్లకు రియల్ ఎస్టేట్ వ్యాపారి నల్లబల్లె వెంకటరాముడు ఆరోపించారు. స్థానిక పోలీస్ స్టేషన్ ఎదుట మీడియాతో మాట్లాడుతూ.. ఎస్ఐ జీవన్ రెడ్డి తనను కమలాపురంలో జరుగుతున్న కోర్టు వాయిదాలకు హాజరు కాకుండా బెదిరిస్తున్నాడని, ఆయనతో తనకు ప్రాణహాని ఉందని నల్లబల్లె వెంకటరాముడు తెలిపారు.
ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలం గొబ్బూరు గ్రామానికి చెందిన ఏలూరు రామచంద్రారెడ్డితో స్థిరాస్తి వ్యాపారం చేశానని, ఆయన మోసం చేయడంతో కోర్టును ఆశ్రయించానని నల్లబల్లె వెంకటరాముడు అన్నారు. రామచంద్రారెడ్డి, ఆయన భార్య వరలక్ష్మి, సోదరుడు సోమిరెడ్డితో ఆర్థిక లావాదేవీలు, కోర్టు కేసులు ఉన్నాయన్నారు. ఈ నేపథ్యంలో వారికి బంధువైన జీవన్‌రెడ్డితో కేసులను విత్ డ్రా చేసుకోకపోతే ఎన్ కౌంటర్ చేయిస్తామని బెదిరిస్తున్నారన్నారు. దీంతో ఆయనపై చర్యలు తీసుకోవాలని స్థానిక ఎస్ఐ హృషి కేశవరెడ్డికి రాతపూర్వకంగా ఫిర్యాదు చేశానన్నారు. గతంలో ఎస్ఐ పై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా న్యాయం జరగలేదని, తనకు ఎలాంటి ప్రాణహాని జరి గినా జీవన్ రెడ్డే బాధ్యత వహించాలని వెంకటరాముడు పేర్కొన్నారు.