జనవరి 3న రైతులతో కలిసి ఆందోళన చేస్తా: జేసీ ప్రభాకర్ రెడ్డి - పత్తి రైతుల ఇబ్బందులు
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 30, 2023, 7:07 PM IST
JC Prabhakar Reddy React on Cotton Farmers Problems: పత్తి సాగుచేసిన రైతులు పంటను కొనేవారు లేక పూర్తిగా నాశనమైపోయారని తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. అనంతపురం జిల్లా పెద్దవడుగూరు మండలంలో పర్యటించిన జేసీ మీడియాతో మాట్లాడారు. రైతుల పరిస్థితిని ప్రభుత్వం పట్టించుకోవటం లేదని ఆరోపించారు. గత ఏడాది పత్తి రైతుల ఇళ్లలో నింపి పెట్టారని, ఈ ఏడాది వచ్చిన దిగుబడిని నిల్వ చేయటానికి స్థలం లేక ఇంటి బయట పడేశారని అన్నారు. ప్రభుత్వం పత్తి రైతుల గురించి ఏమాత్రం కన్నెత్తి చూడటంలేదని విమర్శించారు. ఎమ్మెల్యేలు టికెట్లు, సీట్ల వేటలో ఉన్నారని రైతుల గురించి ఆలోచించటం లేదన్నారు. తాడిపత్రి ఎమ్మెల్యే ఫ్యాక్షన్ చేస్తానంటున్నాడని, ముందు పత్తి రైతుల పంటను కొనాలని మీ సీఎంకు చెప్పాలన్నారు.
సీసీఐ అధికారులు పత్రికా ప్రకటనలకే పరిమితమయ్యారని రైతుల నుంచి ఒక్క క్వింటా కూడా పత్కి కొనటం లేదని జేసీ ప్రభాకర్ రెడ్డి ఆరోపించారు. సీఎం గారూ పత్తి రైతులు నాశనమైనపోతున్నారు, మహాప్రభో పంటను కొనుగోలు చేయండి అంటూ చెతులెత్తి వేడుకున్నారు. సీసీఐ ద్వారా పత్తిని వెంటనే కొనుగోలు చేయకపోతే జనవరి మూడున రైతులతో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. వైఎస్సార్సీపీ నాయకుల బెదిరింపులకు భయపడొద్దని, తాను అండగా ఉంటానని హామీ ఇచ్చారు. తమ ఇంటివద్దకు వచ్చి అన్ని పనులు చేసుకొని పోయిన రెడ్లే కార్లలో తిరుగుతూ, వైఎస్సార్సీపీలో చేరి ప్రజలను బెదిరిస్తున్నారని జేసీ విమర్శించారు.