విశాఖలో ఆర్జీవీపై జనసేన వీర మహిళలు ఆగ్రహం - rgv on janasena

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 25, 2023, 10:26 PM IST

 Janasena Veera Mahila Serious Warning To Ram Gopal Varma:  విశాఖలో దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై జనసేన వీర మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్జీవీకి వ్యతిరేకంగా  జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, వైసీపీ నేతలు నోటికి వచ్చినట్టు మాట్లాడాన్ని తీవ్రంగా ఖండించారు. రామ్ గోపాల్ వర్మ తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇదే తీరు కొనసాగితే, అర్జీవిని రాష్ట్రంలో అడుగు పెట్టనీయమని హెచ్చరించారు. 

ఏ గూటి పక్షులు ఆ గూటికే చేరుతాయన్న చందంగా వైసీపీ నేతలు, టీడీపీ వ్యతిరేకులు వ్యూహం సినిమా పంక్షన్​లో కలిశారని పేర్కొన్నారు. పవన్, చంద్రబాబుపై సినిమా తీసే ఆర్జీవీ, జగన్​పై సినిమా తీయగలడా అని ప్రశ్నించారు.  కోడి కత్తితో ఎలా కోసుకోవాలో చూపించగలడా అంటూ ఎద్దేవా చేశారు. గొడ్డలిపోటుతో ఎలా బాబాయిని నరకాలో చూపించగలడా అని ప్రశ్నించారు. వైసీపీ నేతలపై వ్యతిరేకంగా చూపించే దమ్ము ఆర్జీవీకి ఉందా అని ప్రశ్నించారు. జగన్ పుట్టిన రోజు వేడుకల పేరుతో ప్రజా ధనాన్ని వృథా చేస్తున్న విధానాన్ని ఆర్జీవీ చూపించగలడా అని ప్రశ్నించారు. వైసీపీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, మంత్రుల అక్రమాలను చూపించగలడా అని వీర మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆడుదాం ఆంధ్రా అంటూ రూ. 37 కోట్లు కొల్లగొట్టారని, ఆర్జీవీ ఆ అక్రమాలను చూపించగలడా అని  ఎద్దేవా చేశారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.