Pawan fire on YSRCP: 'వైసీపీ పాలన నుంచి ఉభయగోదావరి జిల్లాలకు విముక్తి కల్పించడమే జనసేన లక్ష్యం': పవన్ - pawan kalyan news
🎬 Watch Now: Feature Video
Jana Sena leader Pawan fire on YSRCP Govt: జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. జగన్ మోహన్ రెడ్డి పాలన నుంచి ఉభయ గోదావరి జిల్లాలకు విముక్తి కల్పించడమే జనసేన పార్టీ ముఖ్యమ లక్ష్యమని ప్రకటించారు. కోనసీమ జిల్లా దిండిలో ఈరోజు పవన్ కల్యాణ్ పార్టీ ముఖ్య నాయకులతో ఆంతరంగిక సమావేశాన్ని నిర్వహించారు. సమావేశంలో భాగంగా ఆయన నేతలతో పలు కీలక విషయాలపై సుదీర్ఘంగా చర్చించారు.
జనసేన లక్ష్యం అదే.. అనంతరం పవన్ కల్యాణ్ మాట్లాడుతూ..''ఉభయగోదావరి జిల్లాలపైనే జనసేన పార్టీ ప్రత్యేకమైన దృష్టి పెట్టింది. ఎందుకంటే.. వైసీపీ పాలన నుంచి ఈ జిల్లాలను ముందుగా విముక్తి చేయాలి. నాకు వైసీపీ అంటే కోపంలేదు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే కోపంలేదు. కేవలం వైసీపీ పాలనపైననే నాకు కోపం ఉంది. ఎందుకంటే.. కనీసం రోడ్లు కూడా వేయని పరిస్థితి కనిపిస్తోంది. రాజోలు నుంచి వస్తుంటే అదొక పడవ ప్రయాణంలా నాకు అనిపించింది. అందుకే వైఎస్సార్సీపీ పాలన నుంచి ఉభయ గోదావరి జిల్లాలకు విముక్తి కల్పించడమే మా మొదటి లక్ష్యం. వచ్చే ఎన్నికల్లో గోదావరి జిల్లాలపై ప్రత్యేక దృష్టి పెడతాం. అందరికీ అన్నం పెట్టే గోదారి నేలను కాపాడుకోవాల్సిన అవసరం అందరిపైనా ఉంది. జనసైనికుల ప్రయత్నాలతో ప్రజల్లో మార్పు ప్రారంభమైంది. ఇది తెలిసే.. అధికార పార్టీ నాపై దాడులకు ప్రోత్సహిస్తోంది.'' అని ఆయన అన్నారు.