JSP Leader Pothina Mahesh on Vahana Mitra మహిళలను బెదిరించి సభకు తీసుకొచ్చారు.. వాహన మిత్ర కార్యక్రమం అట్టర్ ఫ్లాప్: పోతిన మహేష్ - విజయవాడలో సీఎం వైఎస్ జగన్ బహిరంగ సభ
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 29, 2023, 9:43 PM IST
Janasena Pothina Mahesh on Vahana Mithra: విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో జరిగిన వాహన మిత్ర (YSR Vahana Mitra) కార్యక్రమం అట్టర్ ఫ్లాప్ అని జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్ అన్నారు. ఆటో డ్రైవర్ల సమస్యలు గాలికొదిలేశారని.. నాలుగున్నరేళ్ల వైసీపీ పాలనలో విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఏం అభివృద్ధి జరిగింది అనే దానిపై ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదని మండిపడ్డారు. స్ధానిక ప్రజలు ఎవరూ ఈ సభలో పాల్గొనలేదని.. ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా ఉన్న గ్రామాల ప్రజల్ని, డ్వాక్రా మహిళలను బెదిరించి తీసుకు వచ్చారన్నారు. పోలీస్ శాఖ అధికారులు పారిపోతున్న జనాల్ని బ్రతిమలాడే ప్రయత్నం చేస్తూ.. మీడియా కంటపడ్డారని తెలిపారు. ఆటోడ్రైవర్లకు విధించిన ఫైన్లలను సీఎం రద్దు చేసే ప్రకటన చేస్తారని.. ఆటోడ్రైవర్లు ఎంత గానో ఆశపడ్డారని తెలిపారు. పేదలకు, పెత్తందార్లుకు మధ్య యుద్ధం అంటూ మభ్యపెట్టే ప్రసంగం కొనసాగిందని విమర్శించారు. సీఎం జగన్ మాటల్లో ఉన్న ప్రేమ చేతల్లో ఎక్కడా కనిపించడం లేదని.. వైసీపీ నాయకులే బాహాటంగా చెపుకుంటున్నారన్నారు.