'వైసీపీ వద్దు - జనసేన ముద్దు' - అంబటి ఇలాఖాలో మహిళల మనసులో మాట! - Janasena
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 5, 2024, 12:52 PM IST
Janasena Party Logo in YSRCP Rangoli Competition : సంక్రాంతి పండుగకు రాజకీయ పార్టీలు ఊరూ వాడల్లో ముగ్గుల పోటీలు నిర్వహిస్తూ మహిళలను ప్రోత్సహిస్తుంటాయి. ఈ సందర్భంగా కొన్ని ప్రాంతాల్లో వారికి ఊహించని పరిణామాలు ఎదురవుతుంటాయి. కానీ ఆ నియోజకవర్గంలో వైఎస్సార్ పార్టీకి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. గత సంక్రాంతి వేడుకల్లో జనసేనకు మద్దతుగా ముగ్గులు వేశారు. ఇప్పుడు కూడా అదే తరహాలో ముగ్గు వేసి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు.
పల్నాడు జిల్లా రాజుపాలెం మండలం బీరవల్లిపాయలో వైఎస్సార్సీపీ నాయకులకు ఊహించని షాక్ తగిలింది. మంత్రి అంబటి రాంబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న సత్తెనపల్లి నియోజక వర్గంలో నూతన సంవత్సరం, సంక్రాంతి వేడుకలను పురస్కరించుకొని ముగ్గులు పోటీలు నిర్వహించారు. బీరవల్లిపాయలో జరిగిన పోటీల్లో "వైసీపీ వద్దు - జనసేన ముద్దు" అంటూ పసుపులేటి చందుప్రియ అనే బాలిక వేసిన జనసేన లోగో చర్చనీయాంశమైంది. ఆ ముగ్గు మధ్య గాజు గ్లాసు ఉంచారు. లోగో చూసి నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం, మంత్రి అంబటి మీద ఉన్న వ్యతిరేకత మరోమారు బహిర్గతమైందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.