JanaSena Party Leaders Shramadanam for Road: రోడ్ల దుస్థితిపై స్పందించని ప్రభుత్వం.. జనసేన నేతల శ్రమదానం - వైసీపీ

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 2, 2023, 10:48 PM IST

JanaSena Party Leaders Shramadanam for Road: ఆ ప్రాంతంలో రోడ్ల దుస్థితిపై ప్రజలు.. అధికారులు, ప్రజా ప్రతినిధులకు మొర పెట్టుకున్నారు. రోడ్లను మరమ్మతులు చేయకపోవడంతో ఇబ్బందులు పడుతున్న వారిపై అధికార పార్టీ నేతలకు జాలి కలగలేదు. కానీ, ఎలాంటి అధికారంలో లేకపోయినా.. ప్రజలు పడుతున్న సమస్యలపై జనసేన నేతలు స్పందించారు. ప్రభుత్వ నిధులతో బాగు చేయాల్సిన రోడ్డును తమ స్వంత డబ్బులు పెట్టి, జనసైనికుల సహాయంతో రోడ్లను మరమ్మతులు చేయించారు.  

అనంతపురం జిల్లాలో రోడ్ల దుస్థితిని నిరసిస్తూ.. జనసేన పార్టీ నేతలు శ్రమదానం చేశారు. టవర్‌ క్లాక్‌ సమీపంలో నూతనంగా నిర్మించిన వంతెన కింద సర్వీసు రోడ్డు వేయకుండా అధికారులు రెండేళ్లుగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆ పార్టీ నేతలు ఆరోపించారు. సమస్య పరిష్కరించాలని స్థానిక ఎమ్మెల్యేకి మొర పెట్టుకున్నా పట్టనట్లు వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంతల రోడ్లతో వాహనదారులు, ప్రజల నిత్యం నరకయాతన అనుభవిస్తుండటంతో..  జనసేన పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు జయరాం రెడ్డి సొంత నిధులతో మట్టి తరలించి... రోడ్డుపై ఉన్న గుంతల్ని పూడ్చారు. ఎమ్మెల్యే ధనార్జనే ద్యేయంగా పనిచేస్తూ ప్రజల సమస్యలను గాలికి వదిలేసారని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వ విధానాలు ప్రజలు అర్థం చేసుకోవాలని కోరారు. రానున్న ఎన్నికల్లో జనసేన పార్టీకి అవకాశం ఇవ్వాలని కోరారు. అధికారంలోకి వస్తే మరింత అభివృద్ధి చేసి చూపిస్తామన్నారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.