Janasena Support For One Country-One Election: జమిలి ఎన్నికలకు జనసేన మద్దతు.. ఆ విధానంతో బహుళ ప్రయోజనాలు : నాదెండ్ల

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 1, 2023, 7:08 PM IST

thumbnail

Janasena Support For One Country-One Election: దేశంలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ... భారత ప్రభుత్వం కీలక మార్పులను తీసుకురాబోతుందని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. రాబోయే లోక్‌సభ-శాసనసభ ఎన్నికల ఓటింగ్​ను ఒకేసారి నిర్వహించాలన్న లక్ష్యంతో 'ఒకే దేశం-ఒకే ఎన్నికల’ పరిశీలనపై ఓ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో 'ఒకే దేశం-ఒకే ఎన్నిక' విధానానికి జనసేన పార్టీ మద్దతు ఇస్తోందని.. ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ వెల్లడించారు.

పుట్టిన రోజు సందర్భంగా ఐదు రకాల సేవా కార్యక్రమాలు... నాదెండ్ల మనోహర్ ( Nadendla Manohar comments ) మాట్లాడుతూ..''ఒకే దేశం-ఒకే ఎన్నిక' విధానానికి మా పార్టీ మద్దతు ఉంటుంది.. ఈ అంశంపై బీజేపీ పెద్దలు పవన్ కల్యాణ్​తో ఇప్పటికే చర్చించారు. ఈ అంశంపైన మరింత చర్చ జరగాలి. ఈ విధానంతో బహుళ ప్రయోజనాలు ఉన్నాయి. ఎన్నికల సమయంలో జనసేన కార్యాచరణను ప్రకటిస్తాం. ఈ నెల 2వ తేదీన మా పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పుట్టిన రోజును పురస్కరించుకొని.. రాష్ట్ర వ్యాప్తంగా ఐదు రకాల సేవా కార్యక్రమాలు నిర్వహించబోతున్నాం. అందులో మొదటిది.. పార్టీ కార్యాలయంలో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు. 2వది.. ఉదయం భవన నిర్మాణ కార్మికులతో కలసి సంహపక్తి భోజనం. 3వది.. రెల్లి కాలనీ వాసుల మధ్య పుట్టిన రోజు వేడుకలు జరపటం. 4వది.. ఎస్సీ బాలుర వసతి గృహాలలో పెన్నులు, నోట్ బుక్స్ పంపిణీ. 5వది.. ప్రభుత్వ సహాయం అందని విభిన్న ప్రతిభావంతులను దత్తత తీసుకొని.. వారిని ప్రోత్సహించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టనున్నాం.'' అని ఆయన వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.