ఆర్​బీకే నిర్మాణాల్లో భారీ కుంభకోణం - తెచ్చింది ₹2300కోట్లు, ఖర్చు చేసింది ₹156కోట్లు మాత్రమే : నాదెండ్ల - rbk centers

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 22, 2023, 5:01 PM IST

Janasena Nadendla Manohar on RBK Centers: రైతు భరోసా కేంద్రాలను కుంభకోణాలకు నిలయంగా మార్చారని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్‌ ఆరోపించారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు పదివేల రైతు భరోసా కేంద్రాలను నిర్మించాలని జగన్ సర్కార్ నిర్ణయించిందన్నారు. వాటి నిర్మాణానికి కేంద్రం నుంచి రూ.2,300 కోట్ల నిధులు తీసుకొచ్చారని మనోహర్ తెలిపారు. గడిచిన ఐదేళ్లలో ఆర్బీకే నిర్మాణాలకు కేవలం రూ.156 కోట్ల మాత్రమే ఖర్చు చేశారని ఇప్పటికీ చాలా కేంద్రాలు అద్దె భవనాలలో నడుస్తున్నాయి అని తెలిపారు. 

Rythu Bharosa Kendarlu: గతేడాది నుంచి వాటికి అద్దెలు కూడా చెల్లించకుండా భవన యజమానులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని నాదెండ్ల ధ్వజమెత్తారు. కేవలం దళారులకు లబ్ధి చేకూర్చేందుకు మాత్రమే వీటిని ఏర్పాటు చేశారని విమర్శలు గుప్పించారు. తుపాను సమయంలో రైతులను ఆదుకోవాల్సిన భరోసా కేంద్రాలు చేతులెత్తేయడంతో అన్నదాతలు ఎన్నో ఇబ్బందులు పడ్డారని మండిపడ్డారు. ఆర్బీకే కేంద్రాలలో ఉన్న ఎరువులు, విత్తనాలు ఎక్కువ ధరకు రైతులకు అమ్ముతున్నారని నాదెండ్ల మనోహర్‌ ఆరోపించారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.