Janasena Murthy Yadav Fires on AU VC Prasad Reddy: 'చట్ట వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న ఏయూ వీసీ.. విశ్వవిద్యాలయమా.. వైసీపీ కార్యాలయమా..?' - ఏయూ వైస్ ఛాన్సలర్‌పై మండిపడ్డ విశాఖ కార్పొరేటర్
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 12, 2023, 1:39 PM IST
Janasena Murthy Yadav Fires on AU VC Prasad Reddy: ఆంధ్ర విశ్వవిద్యాలయంలో జరుగుతున్న అక్రమాలపై విచారణ జరిపించాలని విశాఖ జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రసాద్‌రెడ్డి యూనివర్సిటీలో చట్ట వ్యతిరేక విధానాలు అవలంభిస్తున్నారంటూ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, కేంద్ర హెచ్ఆర్డీ మంత్రికి ఆయన మెయిల్ చేశారు. ఆంధ్ర విశ్వవిద్యాలయ పాలక మండలి అనుమతి లేకుండా... యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) నిబంధనలు అనుసరించకుండా జేమ్స్ స్టీఫెన్‌ను ఏయూ రిజిస్టర్‌గా జేమ్స్ స్టీఫెన్‌ను నియామకం చేశారని మూర్తి యాదవ్ ఆరోపించారు.
అర్హత లేని జేమ్స్ స్టీఫెన్‌కు ఎలా అంబేడ్కర్ ఛైర్‌ను కట్టబెట్టారని మూర్తి యాదవ్ ప్రశ్నించారు. ఓట్ల రాజకీయం కోసమే వైసీపీ ప్రభుత్వం ఈ రిజిస్ట్రార్ నియమాకాన్ని చేపట్టిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రసాద్‌రెడ్డి యూనివర్సిటీ మొత్తాన్ని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంగా మార్చారని మూర్తి యాదవ్ ఆరోపించారు. వైస్ ఛాన్సలర్ ప్రసాద్ రెడ్డి విధానాల వల్ల నష్టపోయిన వారికి జనసేన పార్టీ అండగా ఉంటుందని మూర్తి యాదవ్ భరోసా ఇచ్చారు.