Janasena leaders house arrest: సీఎం పర్యటన దృష్ట్యా జనసేన నేతలు హౌస్ అరెస్ట్.. ! - CM Jagan visit to Venkatagiri
🎬 Watch Now: Feature Video
Janasena leaders under house arrest: తిరుపతి జిల్లా వెంకటగిరిలో సీఎం జగన్ పర్యటన నేపథ్యంలో శ్రీకాళహస్తిలో పలువురు జనసేన నేతలను పోలీసులు గృహనిర్బంధం చేశారు. ఇటీవల జనసేన నేత సాయిపై సీఐ అంజూయాదవ్ చేయిచేసుకున్న విషయం చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. జిల్లాలో సీఎం పర్యటనతో శ్రీకాళహస్తిలో జనసేన నేతలు ఎలాంటి ఆందోళనలు చేపట్టకుండా ముందస్తుగా వారిని హౌస్ అరెస్ట్ చేశారు. జనసేన నియోజకవర్గ సమన్వయకర్త వినూతతో పాటు నేతలు చంద్రబాబు, సాయి, మహేశ్ తదితర ముఖ్యనేతలను పోలీసులు నిర్బంధించారు.. వారిని బయటకు రానివ్వకుండా ఎక్కడికక్కడ గృహనిర్బంధం చేశారు. అయితే సీఎం పర్యటనను మేము ఎక్కడ అడ్డుకోవాలనేఆలోచన లేనప్పటికీ పోలీసులు అత్యుత్సాహం చూపటం దారుణమని జనసైనికులు ఆవేదన తెలిపారు.
జనసెన జిల్లా ప్రధాన కార్యదర్శి గూడూరు వెంకటేశ్వర్లు ఆల్టూరు పాడు ఆనకట్ట పూర్తి చేయాలని ముఖ్యమంత్రిని నిలదీస్తామని నిన్న ప్రకటించడంతో ఆయన్ను ఇవాళ పోలీసులు గృహ హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. ఇంకా కొందరు విపక్ష నాయకులు, ఒకరిద్దరు విలేకరులను నిర్బంధించటం జరిగింది. ఇలా ఇళ్ల వద్ద పోలీసు బందోబస్తు చేయడంతో జనసేన నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జనసేన పార్టీ అంటే అధికార పార్టీకి అడుగడుగునా ఇంత భయమా? అని ప్రశ్నించారు.