Janasena Leaders Fire on Minister Roja గన్​ కంటే జగన్ ముందే వస్తాడన్న రోజా.. భవ్యశ్రీ హత్యపై స్పందనెందుకు లేదు.. జనసేన నేతల ఘాటు వ్యాఖ్యలు - student Bhavyashri suspicious death news

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 28, 2023, 6:10 PM IST

Janasena Leaders Fire on Minister Roja: చిత్తూరు జిల్లా పెనుమూరు మండలం ఠాణా వేణుగోపాలపురంలో కలకలం రేపిన ఇంటర్ విద్యార్థిని భవ్యశ్రీ(16) అనుమానాస్పద మృతిపై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకూ స్పందించకపోవటం దారుణమని.. జనసేన పార్టీ నేతలు తీవ్రంగా మండిపడ్డారు. 'రాష్ట్రంలోని ఆడ బిడ్డలకు ఏ కష్టమొచ్చిన గన్ వచ్చేలోపు జగన్ వచ్చి శిక్షిస్తాడు' అని మంత్రి రోజా చెప్పిన మాటలు ఏమయ్యాయని ప్రశ్నించారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ముగ్గురు ‌మంత్రులు ఉన్నా.. ఏం చేస్తున్నారని నిలదీశారు.

Janasena Incharge Comments: తిరుపతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో జనసేన నేతలు మీడియాతో మాట్లాడుతూ..''ఆడబిడ్డలకు అన్యాయం జరిగితే గన్ వచ్చేలోపు జగన్ వస్తాడని మంత్రి రోజా చెప్పిన మాటలు ఇప్పుడు ఏమయ్యాయి..?, ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఉన్నా ముగ్గురు ‌మంత్రులు.. భవ్యశ్రీ మృతిపై స్పందించకపోవటం దారుణం. భవ్యశ్రీ కుటుంబ సభ్యులను ఇప్పటిదాకా పరామర్శించకపోవడం విచారకరం. భవ్యశ్రీ కుటుంబానికి ప్రభుత్వం సాయం చేయాలి. 24 గంటల్లో భవ్యశ్రీ మృతిపై నిజాలు బయటపెట్టాలి. లేకపోతే ఉద్యమం తీవ్రతరం చేస్తాం. సీఎం జగన్, మంత్రులు స్పందించి.. భవ్యశ్రీ కుటుంబాన్ని ఆదుకోవాలి.'' అని వారు డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.