Janasena Leaders Warning పవన్ కల్యాణ్‌పై వ్యక్తిగత దూషణలకు దిగితే.. చేతలతోనే సమాధానం చెప్తాం!
🎬 Watch Now: Feature Video
Janasena Leader Warning: ప్రజా సమస్యలను పరిష్కరించలేని వైసీపీ నేతలు.. పవన్ కల్యాణ్‌పై వ్యక్తిగత దూషణలు చేస్తే ఊరుకోమని జనసేన నేత గాదె వెంకటేశ్వరరావు హెచ్చరించారు. పల్నాడు జిల్లా నాదెండ్ల మండలం గణపవరంలో ఉమ్మడి గుంటూరు జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న గాదె వెంకటేశ్వరరావు.. మంత్రి అంబటి రాంబాబుపై విరుచుకుపడ్డారు. వైసీపీ నేతలు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరించారు. మంత్రి అంబటి.. తన పదవి కాపాడుకునేందుకు జనసేనపై ఏదో ఒకటి మాట్లాడాలని.. వ్యక్తిగత దూషణలకు పాల్పడుతున్నారన్నారు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే తగిన విధంగా బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. సదరు మంత్రి ఏ వ్యాపారాలు చేసి బ్రాడీపేట నాలుగో లైన్లో కాంప్లెక్స్ కట్టాడో.. సత్తెనపల్లిలో ఫామ్‌హౌస్ ఏర్పాటు చేసుకున్నాడో ప్రజలందరికీ తెలుసన్నారు. రెండు సంవత్సరాల క్రితం పులిచింతల గేటు కొట్టుకుపోతే ఇంతవరకు దానిని పెట్టడం చేతగాని ఇరిగేషన్ మంత్రికి పవన్ కల్యాణ్‌ను విమర్శించే అర్హత లేదన్నారు. అదే విధంగా ఇతర వైసీపీ నేతలు కూడా నోరు అదుపులో పెట్టుకోకపోతే.. ఇక నుంచి చేతలతోనే సమాధానం చెప్తామని హెచ్చరించారు.