Janasena Leader Gade on R5 Zone ఆర్‌-5 జోన్‌పై హైకోర్టు స్టే.. ప్రభుత్వానికి చెంపపెట్టు: గాదె వెంకటేశ్వరరావు - Janasena Leader Gade Interview

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Aug 3, 2023, 1:03 PM IST

Janasena Leader Gade Venkateshwara Rao Face to Face:  రాజధాని అమరావతి ఆర్‌-5 జోన్‌లో ఇళ్ల నిర్మాణంపై హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం.. స్టే విధించింది. రాజధానేతర ప్రాంత వాసులకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు అమరావతిలో ఆర్‌-5 జోన్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 1402 ఎకరాల్లో ఇళ్ల నిర్మాణ ప్రక్రియకు చర్యలు చేపట్టింది. దీన్ని సవాలు చేస్తూ రాజధాని ప్రాంత రైతు సంక్షేమ సంఘాలు, రాయపూడి దళిత బహుజన సంక్షేమ ఐకాస అధ్యక్షుడు చిలకా బసవయ్య, నిడమర్రు గ్రామానికి చెందిన కె.శ్రీనివాసరావు, కె.పద్మావతి మరికొందరు హైకోర్టులో వ్యాజ్యాలు వేశారు. ఈ పిటిషన్లపై విచారించిన ధర్మాసనం తాజాగా తీర్పు వెల్లడించింది. కాగా ఈ తీర్పుపై హైకోర్టు న్యాయవాది, జనసేన పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు స్పందించారు. రాజధానిలో ఇంటి స్థలాల పేరిట పేదల్ని ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి మోసం చేశారని అన్నారు. R-5 జోన్‌లో ఇళ్ల నిర్మాణంపై హైకోర్టు స్టే ఇవ్వటం ప్రభుత్వానికి చెంపపెట్టని ఆయన వ్యాఖ్యానించారు. ఈ అంశంపై గాదె వెంకటేశ్వరరావుతో మా ప్రతినిధి S.P. చంద్రశేఖర్ ముఖాముఖి.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.