ETV Bharat / state

అందుకే నేను ప్రతీ సంక్రాంతికి మా ఊరికి వెళ్తున్నా: సీఎం చంద్రబాబు - CM CHANDRABABU SANKRANTI WISHES

తెలుగు ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు - హ్యాపీ సండే లాంటి కార్యక్రమాలు గ్రామ స్థాయిలోనూ ప్రోత్సహిస్తామన్న సీఎం

CM_Chandrababu_Sankranti_wishes
CM Chandrababu Sankranti wishes (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 11, 2025, 1:49 PM IST

CM Chandrababu Naidu Wishes: తెలుగు ప్రజలందరికీ ముఖ్యమంత్రి చంద్రబాబు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సంక్రాంతి ప్రజలందరి జీవితాల్లో కొత్త వెలుగులు, ఆనందం నింపాలని ఆయన ఆకాంక్షించారు. సీఎం చంద్రబాబు మీడియాతో ముచ్చటించారు. పండుగ సమయంలో ప్రతి ఒక్కరూ తమ ఊరు వెళ్లి అందరితో కలవటం అలవాటు చేసుకోవాలన్న సీఎం, తాను అందుకే తమ ఊరికి ప్రతీ సంక్రాంతికి వెళ్తున్నానని తెలిపారు. సమాజంలో పై స్థాయిలో ఉన్నవారు దీనిని పాటిస్తే, మిగిలిన వారికి అది ప్రేరణ అని అన్నారు.

తాను తమ ఊరు వెళ్లే సంప్రదాయానికి భువనేశ్వరే కారణమని గుర్తుచేశారు. పాతికేళ్ల క్రితం ఆమె పట్టుబట్టి మొదలు పెట్టిన ఈ సంప్రదాయాన్ని క్రమం తప్పకుండా పాటిస్తున్నామని తెలిపారు. మానవ సంబంధాలు తగ్గిపోతున్న ఈ రోజుల్లో ఒకచోట అంతా కలవటం, మాట్లాడుకోవడం ఎంతో అవసరమని సీఎం స్పష్టం చేశారు.

మనం ఆనందంగా పండుగ చేసుకునేటప్పుడు ఆ ఊరిలో పేదవారు కూడా ఆనందంగా ఉండేలా చూడాల్సిన బాధ్యత మనపై ఉందని తెలిపారు. పేదవాడికి చేయూతనిచ్చి నిలబెట్టాల్సిన బాధ్యత మిగిలినవారిపై ఉందని అన్నారు. ఈ విధానం ప్రోత్సహించటానికే పీ4 కాన్సెప్ట్ పేపర్​ను ఆదివారం విడుదల చేస్తామని, దీనిపై అన్ని స్థాయిల్లో చర్చ జరిగాక అమల్లోకి తెస్తామని వెల్లడించారు. పీ4 విధానం బాగా చేసిన వారికి మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో అవార్డులు ఇచ్చి ప్రోత్సహిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు.

Chandrababu on Sankranti Rush: ఎప్పుడూ లేని విధంగా ఈసారి సంక్రాంతి రద్దీ ఎక్కువగా ఉందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. సొంతూళ్లకు వెళ్లేందుకు ప్రజలు పెద్దఎత్తున తరలివస్తున్నారన్న సీఎం, రద్దీ నియంత్రించటానికి కలెక్టర్లతో మాట్లాడతానని అన్నారు. ముఖ్య నగరాలకు చేరుకున్న వారిని స్వగ్రామాలకు చేర్చేందుకు కళాశాలలు, పాఠశాలల బస్సులు ఏర్పాటు సూచనను పరిశీలిస్తామన్నారు. గత సంక్రాతితో పోల్చితే చాలా వరకూ రహదారులను మెరుగుపరిచామన్న సీఎం, వచ్చే నెలాఖరుకు మిగిలిన రహదారులు బాగుచేస్తామన్నారు. ప్రజల మధ్య సత్సంబంధాలు పెంచేందుకు పండుగలు ఓ వారధి కావాలని ఆకాంక్షించారు. ప్రభుత్వ పరంగానూ హ్యాపీ సండే లాంటి కార్యక్రమాలు ఈ సారి గ్రామ స్థాయిల్లోనూ ప్రోత్సహిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు.

పేదరిక నిర్మూలనకు చంద్రబాబు కొత్త ఫార్ములా- నీతి అయోగ్​ సమావేశంలో ప్రతిపాదన - CHANDRABABU POLICY

జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ - కిటకిటలాడుతున్న టోల్‌గేట్లు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.