Two Dead Three Injured in Road Accident at Kakinada District : కాకినాడ జిల్లా శంఖవరం మండలం కత్తిపూడి జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని కారుతో ఢీకొని ఇద్దరు మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. భీమవరం నుంచి అన్నవరం దర్శనానికి వెళ్తుండగా ప్రమాదం జరిగిందని బాధితులు తెలిపారు. ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా క్షతగాత్రులను తుని ఆస్పత్రికి తరలించారు.
చవ్వాకుల శ్యామ్ ప్రసాద్ (49), కరీంశెట్టి శివ నారాయణ (38), కరీంశెట్టి దివ్య (33) అక్కడికక్కడే మరణించారు. మరో నలుగురిని తుని ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.
కృష్ణా జిల్లా గన్నవరం మర్లపాలెం కొత్త బైపాస్ వద్ద 2 కార్లు ఢీకొని ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. కార్లు ఎదురెదురుగా వచ్చి ఒకదాన్ని ఒకటి ఢీ కొనడంతో ప్రమాదం జరిగింది. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.
విజయవాడలో ఆర్టీసీ బస్సు బీభత్సం - పలు వాహనాలు ధ్వంసం
ఉపాధి కోసం రాష్ట్రం దాటి వస్తున్న వలస కూలీల జీవితాలు చీకట్లో కలిసిపోయాయి. రహదారి మధ్యలో ఆగిన లారీని బస్సు అతివేగంతో ఢీకొనడంతో నలుగురు ఒడిశా కూలీలు సహా డ్రైవర్ దుర్మరణం పాలయ్యారు. ఈ విషాద ఘటన సూర్యాపేట జిల్లాలో హైదరాబాద్-ఖమ్మం 365 జాతీయ రహదారిపై శుక్రవారం తెల్లవారుజామున జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఒడిశాలోని నువాపడ, నవరంగాపూర్, కోరాపుట్, కలహండి జిల్లాలకు చెందిన 32 మంది హైదరాబాద్‌లో భవన నిర్మాణ పనుల కోసం ఈ నెల 9న ఒడిశా రాష్ట్రంలోని సినాపల్లి నుంచి మధ్యాహ్నం 3 గంటలకు గుప్తా ట్రావెల్స్‌కు చెందిన బస్సులో బయల్దేరారు. వీరిని ఓ ఏజెన్సీ తీసుకొస్తోంది.
సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం అయిలాపురం సమీప ఆంగోతుతండా రాగానే రోడ్డుపై సాంకేతిక లోపంతో నిలిచిన ఇసుకలోడు లారీని తెల్లవారుజామున 3.30 గంటలకు బలంగా ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు బస్సు నుజ్జునుజ్జు కాగా డ్రైవర్ సునీల్‌గోర్డా(37), దంపతులు రూపు హరిజన్(51), సూల హరిజన్(46), వారి సమీప బంధువు సుభమణి హరిజన్(61) అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రగాయాలైన ప్రభాత్ హరిజన్(17)ను హైదరాబాద్ తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. 18 మంది గాయపడ్డారు.
ఆ రోడ్డులో తిరుపతి వెళ్లాలనుకుంటున్నారా? - కాస్త ఆలోచించుకోవడమే బెటర్!