Janavani Sabha in Amalapuram: 'చలో అమలాపురం'.. పవన్ సభకు భారీగా చేరుకుంటున్న జనసైనికులు - అమలాపురం
🎬 Watch Now: Feature Video
Janasena chief Pawan Kalyan's visit to Amalapuram: అమలాపురంలో జనసేన అధినేత పవన్‌కల్యాణ్ పాల్గొననున్న జనవాణి సభకు ప్రజలు, అభిమానులు భారీగా తరలివచ్చారు. తమ సమస్యలు చెప్పుకునేందుకు వేలాదిగా వచ్చిన వారిని అదుపు చేయడం పోలీసులకు కష్టసాధ్యమైంది. పవన్ కల్యాణ్‌ను కలిసి తమ అభిప్రాయాలు చెప్పేందుకు వచ్చామని కిమ్స్ వైద్య విద్యార్థులు కొందరు చెప్పారు. ఆయన సీఎం కావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. సాయంత్రం జరిగే పవన్ సభ విజయవంతమవుతుందని.. తరలివచ్చే జనసందోహానికి అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నామని జనసేన నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా జనసేన నాయకుడు శ్రీకాంత్ మాట్లాడుతూ నిన్న ముమ్మిడివరంలో జరిగిన సభకు లక్షలాదిగా తరలివచ్చారని తెలిపారు. ఇవాళ అమలాపురంలో జరిగే సభకు అంతకుమించి పోటెత్తే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇప్పటికే పెద్ద గ్రౌండ్‌ను ఎంపిక చేసి భారీగా ఏర్పాట్లు చేశాం అని చెప్పారు. ఇప్పటికే భారీగా తరలివచ్చారు... ఇంకా చాలా మంది వస్తున్నట్లు సమాచారం ఉంది.. గ్రౌండ్ సరిపోతుందో లేదో అని ఆందోళనగా ఉంది అని అన్నారు. పవన్ కల్యాణ్ చేపట్టిన వారాహి యాత్రకు ప్రజల్లో చాలా స్పందన ఉంది. పవన్ కల్యాణ్ సీఎం అయ్యే అవకాశాలున్నాయి అని అక్కడకు వచ్చిన పలువురు యువకులు తమ అభిప్రాయం వ్యక్తం చేశారు.