Jagananna Colony Layout: లబోదిబోమంటున్న జగనన్న కాలనీ ఇళ్ల స్థలాల లబ్దిదారులు.. - latest ap telugu news
🎬 Watch Now: Feature Video
Jagananna Colony Layouts Lands are in Poor Condition: ప్రభుత్వం చెప్తున్నంత గొప్పగా జగనన్న ఇళ్ల స్థలాల మంజూరు లేదని లబ్దిదారులు వాపోతున్నారు. గ్రామానికి దూరంగా ఇంటి నిర్మాణానికి పనికిరాని భూములను పంపిణీ చేశారని ఆరోపిస్తున్నారు. గతి లేని పరిస్థితుల్లో అప్పులు చేసి ఇళ్ల నిర్మాణాలు చేపట్టినప్పటికి.. నేల స్వభావం సరైంది కాకపోవటంతో నిర్మాణ దశలోనే కూలిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రకాశం జిల్లాలోని కనిగిరిలో జగనన్న లేఅవుట్లది ఈ పరిస్థితి. అధికారుల ఒత్తిడితో అప్పు చేసి ఇళ్లు నిర్మించుకుంటున్నామని లబ్దిదారులు తెలిపారు. భూమి స్వభావం సరిగా లేక బేస్ మట్టాలు కుంగిపోతున్నాయని.. నిర్మాణం పూర్తికాకముందే ఇంటి గోడలు పగుళ్లు చూపిస్తున్నాయని అంటున్నారు. అప్పులు చేసి మరీ ఇళ్ల నిర్మాణాలు చేపట్టామని వివరించారు. ఇదిలా ఉండగా.. ఇంటి నిర్మాణాలు పూర్తి కాకముందే విద్యుత్ అధికారులు మీటర్లను అంటగాడుతున్నారని అన్నారు. విద్యుత్ బిల్లు ముక్కు పిండి మరీ వసూలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా ఇంటి నిర్మాణాల కోసం తీసుకువచ్చిన గృహ నిర్మాణ సామాగ్రి సైతం చోరికి గురవుతోందని లబ్దిదారులు లబోదిబోమంటున్నారు.