Poor People Houses In Amaravathi: అమరావతిలో ఇళ్ల నిర్మాణానికి నేడు శంకుస్థాపన.. సీఎం బహిరంగ సభకు వెయ్యి ఆర్టీసీ బస్సులు.. - అమరావతిలో పేద ప్రజలకు ఇళ్ల పట్టాలు
🎬 Watch Now: Feature Video
Poor People Houses In Amaravathi: అమరావతిలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు కేటాయించిన లేఅవుట్లలో 50 వేల 7 వందల 93 ఇళ్ల నిర్మాణానికి, 45 సామాజిక మౌలిక వసతుల ప్రాజెక్టులకు సీఎం జగన్ శంకుస్థాపన చేయనున్నారు. గుంటూరు జిల్లా కృష్ణాయపాలెం లేవుట్ వద్ద ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఇళ్ల నిర్మాణానికి 1,371 కోట్లు, మౌలిక వసతుల కల్పనకు 384 కోట్ల రూపాయలను వెచ్చించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. 73 కోట్ల రూపాయలతో 11 అంగన్‌వాడీ కేంద్రాలు, 11 పాఠశాలలు,11 డిజిటల్ గ్రంథాలయాలు, 12 ఆస్పత్రుల నిర్మాణాన్ని చేపట్టనున్నట్లు తెలిపింది. సీఎం జగన్ కార్యక్రమం, బహిరంగ సభకు దాదాపు వెయ్యి ఆర్టీసీ బస్సులను కేటాయించారు. జన సమీకరణ కోసం ఏకంగా 270 కిలోమీటర్ల దూరంలో ఉన్న తుని డిపో నుంచి బస్సులను కేటాయించారు. రాష్ట్రంలోని 12 జిల్లాల్లోని 49 డిపోల నుంచి బస్సులను మళ్లించారు. సీఎం సభ కోసం విజయవాడ జోన్‌లో 28 డిపోల నుంచి 500 బస్సులను కేటాయించారు.