Interview With Ravani Playing in Blind Cricket: వనం నుంచి మైదానం వరకు.. అంతర్జాతీయ అంధుల క్రికెట్​లో యువతి సత్తా - AP Latest News

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 17, 2023, 10:14 PM IST

Interview With Ravani Playing in Blind Cricket: పుట్టింది కడు పేదరికంలో. పైగా పుట్టుకతో అంధురాలు. ఐదుగురు సంతానం గల ఆ పేద కుటుంబం గడవడమే చాలా కష్టం. ఆ సమయంలో ఆమెని చినజీయర్‌ స్వామి నేత్రాలయంలో జాయిన్‌ చేశారు. అక్కడే ఆమె జీవితం మలుపు తిరిగింది. చదువుతో పాటు అథ్లెటిక్స్‌లో పాల్గొంటున్న ఆమె క్రమంగా క్రికెట్‌ వైపు దృష్టి సారించింది. దశల వారిగా ఎదుగుతూ.. ఇటీవల బర్మింగ్‌హమ్‌లో జరిగిన అంతర్జాతీయ అంధుల క్రికెట్‌ కప్‌లో సత్తా చాటి భారత్‌ జగజ్జేతగా నిలిచేందుకు కారణమైంది అల్లూరి జిల్లా రంగసింగిపాడుకు చెందిన వలసనైన రవణి. మరి, మన్యం ప్రాంతం నుంచి తన కీర్తిని విశ్వవ్యాప్తం ఎలా చేసుకుంది. భారత్ తరపున ఆస్ట్రేలియాపై నెగ్గి స్వదేశానికి రాగానే పాడేరు నుంచి తన స్వగ్రామం వరకు భారీ ద్విచక్ర వాహనాలు ర్యాలీతో రవణిని ఊరేగించారు. కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ సుమిత్ కుమార్ అభినందించారు. మహిళా సంఘ సభ్యులు ఇంటికి వెళ్లి సన్మానించారు అరకులో ఎమ్మెల్యే శెట్టి పాల్గున శాలువా కప్పి సన్మానించారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.