NEET toppers: సాధించాలనే పట్టుదల.. తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే ర్యాంక్లు - neet 2023 topper interview
🎬 Watch Now: Feature Video
Interview with toppers in NEET: ప్రవేశ పరీక్ష ఏదైనా సరే, టాప్ ర్యాంకులు సాధించటమే లక్ష్యంగా పెట్టుకుంటున్నారు తెలుగు రాష్ట్రాల విద్యార్థులు. దేశవ్యాప్తంగా వైద్యవిద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ ఫలితాల్లో కూడా అదే రకమైన ప్రభంజనం సృష్టించారు. స్పష్టమైన లక్ష్యంతో.. ప్రణాళికబద్ధంగా గంటల తరబడి చదివారు. దాదాపు 20 లక్షల మందితో పోటీ పడ్డారు. చివరకు అనుకున్నది సాధించి టాప్ 50 ర్యాంకుల్లో ఏడుగురు తెలుగు రాష్ట్రాల విద్యార్థులు విజయకేతనం ఎగరవేశారు.. అందులో మన రాష్ట్రానికి చెందిన శ్రీకాకుళం కుర్రాడు బోరా వరుణ్ చక్రవర్తి ఏకంగా ఆల్‌ఇండియా ఫస్ట్ ర్యాంకు సాధించగా.. ఎస్ వరణ్ 9వ ర్యాంకు సొంతం చేసుకున్నాడు. మరో విద్యార్థి రఘురాంరెడ్డి 15వ ర్యాంకుతో రాణించాడు. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో పాటు సాధించాలనే పట్టుదలతో మంచి ఫలితాల వైపు నడిచామని ఆ విద్యార్థులు చెబుతున్నారు. మరి, ఇంతటి విజయాన్ని సాధించటానికి వారంత ఎలాంటి ప్రణాళికతో ముందుకు వెళ్లారు..? భవిష్యత్ లక్ష్యాలు ఏంటి..? ఆ టాపర్ల మాటాల్లోనే విందాం.