Interview with Group-1 Ranker Pradeepti: మహిళలపై అకృత్యాల నివారణకు కృషి చేస్తా..: గ్రూప్‌-1 ర్యాంకర్​ ప్రదీప్తి - ETV Bharat Yuva Stories

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 27, 2023, 2:32 PM IST

Exclusive Interview with Group-1 Ranker Pradeepti: గ్రూప్‌-1 అభ్యర్థుల జాబితాను ఏపీ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ప్రకటించింది. ఫలితాల్లో అత్యుత్తమ ర్యాంకులు సాధించిన పలువురు అభ్యర్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రెండు మార్కులతో సివిల్స్‌ కోల్పోయింది ఆ యువతి. అయితేనేం మరోసారి ప్రయత్నిద్దాం అనుకుంది. ఈ క్రమంలోనే గ్రూప్‌-2లో పరీక్ష రాసి ఎక్సైజ్ ఎస్సైగా కొలువు సాధించింది. కానీ ఇంతటితో ఆగిపోకుండా.. ఉన్నత శిఖరాలు అధిరోహించే దిశగా అడుగులు వేసింది. ఈ లోపే గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ రావడంతో చక్కటి ప్రణాళిక వేసుకుని సన్నద్ధమయ్యింది. కట్‌చేస్తే ఇటీవల వెల్లడైన గ్రూప్‌-1 ఫలితాల్లో సత్తాచాటి.. డీఎస్పీ ఉద్యోగానికి ఎంపికైయ్యింది. మహిళలు తలుచుకుంటే ఏదైనా సాధించవచ్చని నిరూపించారు. డీఎస్పీగా బాధ్యతలు తీసుకున్నాక మహిళలు, చిన్నారులపై జరుగుతున్న అకృత్యాలు నివారణకు కృషి చేస్తానంటున్నారు. తనే శ్రీకాకుళం జిల్లాకు చెందిన పేడాడ ప్రదీప్తి.. మరి, తన గ్రూప్‌-1 సాధన ఎలా సాగింది..? భవిష్యత్‌ కార్యచరణ ఎలా ఉండనుందో తన మాటల్లోనే తెలుసుకుందాం ఇప్పుడు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.