Interview With Former SEC Chief Nimmagadda RameshKumar: ఒకే సారి ఓట్ల తొలగింపు సాధ్యం కాదు.. అలాచేస్తే ఈసీకి ఫిర్యాదు చేయాలి: నిమ్మగడ్డ - ఫేక్ ఓట్స్ ఇన్ ఏపీ
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 1, 2023, 1:48 PM IST
Interview With Former SEC Chief Nimmagadda Ramesh Kumar: గంపగుత్తగా ఒకే సారి ఓట్ల తొలగింపు సాధ్యం కాదని రాష్ట్ర ఎన్నికల సంఘం మాజీ ప్రధాన అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ తెలిపారు. ఓటు హక్కు కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. ఫారం 13 ఇచ్చాకే ఓటు తొలగించాలని నోటీసు ఇవ్వకుండా తీసేస్తే ఈసీకి ఫిర్యాదు చేయాలని ప్రతి ఒక్కరికి సూచించారు. ఓట్ల తొలగింపనేది చిన్న విషయం కాదని ఉద్దేశపూర్వకంగా ఓట్లు తొలగిస్తే తగిన ఆధారాలతో ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తే న్యాయం జరుగుతుందని రమేష్‌కుమార్ తెలిపారు. ఓట్ల నమోదుకు సంబంధించి ఎన్నికల సంఘం నిర్వహించే కార్యక్రమాలు పారదర్శకంగా ఉంటాయని ఆయన తెలిపారు. ఒకేసారి కొన్ని వేల ఓట్లను తొలగించడంకానీ, నమోదుచేయడం కానీ సాధ్యం కాదని అన్నారు. ఓటర్ ఐడీని ఆధార్ కార్డుతో లింక్ చేస్తేనే మల్టిపుల్ ఓటింగ్ తగ్గడం సాధ్యమంటున్న నిమ్మగడ్డ రమేష్ కుమార్‌తో మా ప్రతినిధి ముఖాముఖి.