CPI Ramakrishna: ప్రభుత్వం, పోలీసులు.. ఇప్పటికైనా కళ్లు తెరవాలి: సీపీఐ రామకృష్ణ - High Court Judgment on GO Number One
🎬 Watch Now: Feature Video
ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ వన్ను కొట్టివేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ జీవో ప్రాథమిక హక్కులకు భంగం కలిగించే విధంగా ఉందని కోర్టు అభిప్రాయపడింది. జగన్ ప్రభుత్వం రహదారులపై బహిరంగ సమావేశాలు నిర్వహించకుండా ప్రతిపక్షాలు, ఇతర రాజకీయ పార్టీల గొంతు నొక్కేందుకు జీవో1 తీసుకొచ్చిందని.. ఆ జీవోను కొట్టేయాలని కోరుతూ సీపీఐ నేత రామకృష్ణతో పాటుగా పలు పార్టీల నేతలు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. పిటిషన్లపై విచారణ చేపట్టిన ధర్మాసనం.. నేడు తీర్పును వెలువరించింది. ఈ జీవో నంబర్ ఒకటిని కొట్టేస్తూ ఇచ్చిన తీర్పు పట్ల సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ హర్షం వ్యక్తం చేశారు. చిన్న ఉద్యమం చేసినా ఈ ప్రభుత్వం సహించలేక పోతోందని దుయ్యబట్టారు. ప్రభుత్వం, పోలీసులు.. ఇప్పటికైనా కళ్లు తెరవాలని సూచించారు. ప్రశాంతంగా నిరసన తెలిపే హక్కు ప్రజలకు, ప్రతిపక్షాలకు ఉందని అన్నారు. కోర్టు తీర్పుపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ స్పందనను మా ప్రతినిధి జయప్రకాశ్ అందిస్తారు.