కనకదుర్గమ్మ అమ్మవారి సన్నిధిలో భారత అండర్-19 క్రికెటర్లు - Vijayawada News

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 23, 2023, 10:34 PM IST

Indian Under 19 Cricketers in Indrakeeladri Temple  : భారత అండర్‌-19 క్రికెటర్లు విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. బీసీసీఐ (BCCI)  అండర్‌-19 క్వాడ్రాంగ్యులర్‌ సిరీస్‌లో భాగంగా ఈ బృందం విజయవాడ వచ్చింది. యువ క్రికెటర్లను దేవస్థానం అధికారులు, పాలకమండలి సభ్యులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి.. అమ్మవారి దర్శనం కల్పించారు. అనంతరం పండితులతో వేదాశీర్వచనం చేయించి అమ్మవారి ప్రసాదం, శేషవస్త్రం, చిత్రపటాన్ని అందజేశారు.

అదేవిధంగా మంగళవారం.. ఇంగ్లండ్ అండర్-19 క్రికెట్ టీమ్ ఇంద్రకీలాద్రిలోని కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. 19 మంది జట్టు ఆటగాళ్లు మంగళవారం రోజు ఉదయం కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. ఆలయ పాలకమండలి, అధికారులు వారికి మర్యాదలతో స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం వేద పండితులు వేదాశీర్వచనం చేశారు. ఇంగ్లండ్ ఆటగాళ్లకు అమ్మవారి ప్రసాదం, శేషవస్త్రంను పాలకమండలి సభ్యులు అందజేశారు. భారతదేశంలో వన్డే సిరీస్ ఆడేందుకు ఇంగ్లండ్ అండర్-19 యువ క్రికెట్ టీమ్ వచ్చిన విషయం తెలిసిందే. ఈ వన్డే సిరీస్​లో భారత్ నుంచి రెండు టీమ్స్ ఆడుతుండగా.. ఇంగ్లండ్, బంగ్లాదేశ్ జట్లు బరిలో ఉన్నాయి. నవంబర్ 13న ప్రారంభం అయిన ఈ సిరీస్.. నవంబర్ 27తో ముగుస్తుంది. ఇక విజయవాడ మూలపాడులోని దేవినేని వెంకట రమణ ప్రణీత మైదానంలో ఈ మ్యాచులు జరుగుతున్నాయి.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.