Indian Association of Lawyers Protest in Vijayawada: ఇండియన్ అసోషియేషన్ ఆఫ్ లాయర్స్ రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు.. - Vijayawada latest news
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 27, 2023, 4:07 PM IST
Indian Association of Lawyers Protest in Vijayawada to Solve Pending Problems : న్యాయవాదుల పెండింగ్ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలంటూ ఇండియన్ అసోషియేషన్ ఆఫ్ లాయర్స్ ఆధ్వర్యంలో విజయవాడలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు న్యాయవాదులకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. చనిపోయిన న్యాయవాదుల కుటుంబాలకు మ్యాచింగ్ గ్రాంట్ నిధులు వెంటనే మంజూరు చేయాలని ఫ్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. 35 సంవత్సరాలు నిండిన న్యాయవాదులకు కూడా వెల్ఫేర్ ఫండ్ అవకాశం కల్పించాలని వారు అన్నారు. కోర్టు భవన సముదాయాల్లో మౌలిక వసతులు కల్పించి ఆగిపోయిన భవనాలను పూర్తిగా నిర్మించాలని విజ్ఞప్తి చేశారు. నిర్మాణ దశలో ఉన్న కోర్టు భవనాలు వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ వారు డిమాండ్ చేశారు.
"రాష్ట్రంలో న్యాయవాదులు ఎదుర్కోంటున్న సమస్యలను పరిష్కరించాలని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కోర్టుల ముందు నిరసన కార్యక్రమం చేస్తున్నాము. చనిపోయిన న్యాయవాదుల కుటుంబాలకు మ్యాచింగ్ గ్రాంట్ నిధులు వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేస్తున్నాం."- న్యాయవాదులు