మిగ్జాం తుపాను బీభత్సం - వానలు తగ్గక, నీరు కదలక రైతులు యాతన - Farmers problems due to cyclone Migzam
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 6, 2023, 3:08 PM IST
Impact of Cyclone Michaung on Kakinada District : కాకినాడ జిల్లాపై మిగ్జాం తుపాను తీవ్ర ప్రభావం చూపింది. కోతకు సిద్ధమైన వరి ఒరిగిపోయింది. పనల దశలో ఉన్నది తడిసింది. కల్లాల్లో, రోడ్ల పక్కన రాశులు పోసి బరకాలు కప్పిన ధాన్యం కిందకు, అలాగే వ్యవసాయ క్షేత్రాల్లోకి నీరు చేరింది. వానలు తగ్గక, నీరు కదలక రైతులు యాతన పడుతున్నారు. తేమతో సంబందం లేకుండా ధాన్యం కొంటామని ప్రకటనలు వెలువడుతున్నా, క్షేత్రస్థాయిలో పట్టించుకునేవారు కరువయ్యారు. కొత్తపేట, ముమ్మిడివరం, పి.గన్నవరం, రాజోలు, అమలాపురం నియోజకవర్గాల్లో దయనీయ పరిస్థితి నెలకొంది.
తుని పట్టణం భారీ వర్షానికి అతలాకుతలమైంది. తునిలో రహదారులన్నీ జలమయమై రాకపోకలు నిలిచిపోయాయి. తాండవ నదిలో నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. తుపాను నేపథ్యంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో బుధవారం జిల్లాలోని అన్ని పాఠశాలలకు సెలవు ప్రకటించినట్లు డీఈవో జి. నాగమణి తెలిపారు. వాతావరణ కేంద్రం సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. అన్ని యాజమాన్య పాఠశాలలు ఈ ఆదేశాలను పాటించాలని ఆమె సూచించారు. ఆదేశాలను ధిక్కరించి పాఠశాలలు తెరిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.