Soil Mining బాపట్లలో అక్రమ మట్టితవ్వకాలు.. వైసీపీ నేతల అండ రెచ్చిపోతున్న మాఫియా
🎬 Watch Now: Feature Video
Illegal Mining : బాపట్ల జిల్లా నగరం మండలంలో అక్రమార్కులు నిబంధనలుకు విరుద్ధంగా మట్టి తవ్వకాలు చేస్తున్నారు. అధికార పార్టీ నాయకుల అండదండలతో పచ్చని పంట పొలాలను నిబంధనలకు విరుద్దంగా తవ్వి సొమ్ము చేసుకుంటున్నాని స్థానికులు తెలిపారు. పంటభూములనే కాకుండా ఆర్ ఎం డ్రైన్ లు సైతం వదలకుండా తవ్వకాలు చేస్తున్నారని స్థానికులు చెప్పారు. పూడివాడ, బెల్లం వారిపాలెం, కమ్మవారి పాలెం, సజ్జావారిపాలెం, మట్టపూడి, సిరిపూడి, మీసాలవారిపాలెం గ్రామాల్లోని పొలాలను మెరకల నెపంతో భారీ ఎత్తున గుంటలు తవ్వి.. ట్రాక్టర్ మట్టి రూ. వెయ్యి నుంచి 15 వందల వరకు అమ్ముతున్నారని వారు తెలిపారు.
అయితే మండల స్థాయి అధికార పార్టీ నాయకుడు తన చెరువులు తవ్వడం కోసం ఏకంగా మండల కేంద్రం సమీపంలో ఉన్న ఆర్ ఎం డ్రైన్ కట్టను సైతం కొల్ల కొట్టిన ఏ ఒక్క అధికారి పట్టించుకోవడం లేదని స్థానికులప వాపోయారు. సమీపంలోనే రెవెన్యూ, పోలీస్,సెబ్ కార్యాలయాలు ఉన్న అక్రమ తవ్వకాలను అడ్డుకునేందుకు అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవరించడం పై ప్రజల నుంచి పలు విమర్శలు వస్తున్నాయి. భారీ వర్షాలు కురిస్తే కట్టలు తెగి పంట పొలాలు ముంపునకు గురవుతాయని రైతులు ఆందోళన చెందుతున్నారు.
ఇవీ చదవండి :