Idols Found In Pit: తాగునీటి కోసం గుంత.. బయటపడిన పురాతన విగ్రహాలు

🎬 Watch Now: Feature Video

thumbnail

Idols Found In Pit Guntakal: తాగునీటి పైపులైన్‌ కోసం మున్సిపాలిటీ అధికారులు గుంత తవ్వడం వల్ల సీతారాముల విగ్రహాలు లభ్యమైన ఘటన అనంతపురం జిల్లా గుంతకల్లులో జరిగింది. ఈ అంశం స్థానికంగా చర్చనీయాంశమైంది. పురాతన కాలం నాటి ఓ రాతిబండపై శ్రీ సీతారాముల ప్రతిమల రూపాలు చెక్కి ఉన్నాయి. ఈ ప్రతిమల  గురించి తెలుసుకున్న స్థానికులు ఆ విగ్రహన్ని దర్శించుకునేందుకు భారీగా తరలి వస్తున్నారు. ఈ విగ్రహం సుమారు 1500 సంవత్సరాల కిందట అయి ఉంటుందని స్థానికులు భావిస్తున్నారు. తవ్వకాల్లో లభ్యమైన ఈ సీతారాముల ప్రతిమలకు స్థానికులు నీళ్లు పోసి వారి మెుక్కులను చెల్లించుకుంటున్నారు.  ఈ  విగ్రహాన్ని పురావస్తు, రెవెన్యూశాఖ అధికారులు స్వాధీనం చేసుకుని, ఈ ప్రతిమ వయస్సు ఎంత ఉంటుందో నిర్థారించాలని స్థానికులు డిమాండ్ చేశారు. ఈ విగ్రహం దొరికిన చోట పురాతన కాలంలో ఏదైనా ఆలయం ఉండి ఉండవచ్చునని స్థానికులు భావిస్తున్నారు. దీనిపై పురావస్తు శాఖ వారు పరిశోధనలు నిర్వహించాలని ఆ ప్రాంతం వారు  కోరుతున్నారు. 

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.