I Pac Team in Yuvagalam: "లోకేశ్​ పాదయాత్రలో ఐప్యాక్ సభ్యులు.. వైసీపీ దిగజారుడు రాజకీయాలకు ఇదే నిదర్శనం" - లోకేష్ పాదయాత్ర

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jul 19, 2023, 12:34 PM IST

I Pac Members in Yuvagalam Padayatra: తెలుగుదేశం పార్టీ  జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్​ యువగళం పాదయాత్ర ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గంలో కొనసాగుతోంది. ఈరోజు లోకేశ్​ యువగళం పాదయాత్రలో ఐప్యాక్ సభ్యుల్ని తెలుగుదేశం శ్రేణులు పట్టుకున్నారు. కనిగిరి నియోజకవర్గంలో యువగళం పాదయాత్ర పై ఐ ప్యాక్ సభ్యులు నిఘా పెట్టారని టీడీపీ శ్రేణులు ఆరోపించాయి. లోకేశ్​ పాదయాత్రకు సంబంధించిన విషయాలు ఎప్పటికప్పుడు బయటికి చేరవేస్తుండగా యువగళం బృందం రెడ్ హ్యాండెడ్​గా పట్టుకుంది. ఒకడిని పట్టుకోగానే ఇతర సభ్యులు అక్కడి నుంచి పరారైయ్యారు. వైఎస్సార్​ కాంగ్రెస్​ పార్టీ దిగజారుడు రాజకీయాలకు ఇదే నిదర్శనం అని తెలుగుదేశం నేతలు మండిపడుతున్నారు. కవ్వింపు చర్యలు, కుట్రలు పన్నెలా ఐప్యాక్ సభ్యులు యువగళంలోకి చొరబడుతున్నారని తెలుగుదేశం ఆగ్రహం వ్యక్తం చేసింది. కాగా యువగళం పాదయాత్ర కనిగిరి నియోజకవర్గం అజీస్​పురంలో 2100 కిలోమీటర్లు పూర్తి చేసుకోనుంది.  ఈ క్రమంలో నారా లోకేశ్​ శిలాఫలకం ఆవిష్కరిస్తారు. 

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.