Huge Devotees Rush In Tirumala: తిరుమలకు పోటెత్తిన భక్తులు.. శ్రీవారి దర్శనానికి 30 గంటల సమయం - Huge Devotees Rush In Tirumal
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/640-480-18669424-140-18669424-1685845687052.jpg)
Huge Devotees Rush In Tirumala Tirupati Temple : తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. స్వామి వారి దర్శనానికి 30 గంటల సమయం పడుతోంది. వేసవి సెలవలు ముగుస్తుండటంతో తిరుమలకు భక్తులు బారులు తీరుతున్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్సులోని అన్ని కంపార్టుమెంట్లు, నారాయణగిరి ఉద్యానవనంలోని షెడ్లు నించి గోగర్భం జలాశయం వరకు భక్తులు వేచి ఉన్నారు. ప్రస్తుతం గోగర్భం వద్ద ఆక్టోపస్ భవనం నుంచి క్యూ లైన్‌లోకి భక్తులను తిరుమల తిరుపతి దేవస్థానం అనుమతి ఇస్తోంది. క్యూ లైన్‌లో వేచి ఉన్న భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం అన్నదాన సిబ్బంది తాగు నీరు, అల్పాహారం అందిస్తున్నారు. మరో వైపు వసతి సౌకర్యాలు లేక భక్తులు ఔటర్ రింగు రోడ్డు వద్దే నిద్రిస్తున్నారు. శ్రీవారి ఆలయంలో జేష్టాభిషేకం కారణంగా కాలినడకన వచ్చే భక్తులకు టోకెన్ల కోటాను తగ్గించారు. తిరుమల తిరుపతి దేవస్థానం ముందస్తు ప్రకటనలు చేయకపోవడంపై శ్రీవారి భక్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.