Highlife Brides Exhibition: విజయవాడలో 'హై లైఫ్ బ్రైడ్స్' ఎగ్జిబిషన్.. ప్రముఖ మోడల్స్‌తో ప్రదర్శన - AP Latest News
🎬 Watch Now: Feature Video
Highlife Brides Wedding Show: 'హైలైఫ్ బ్రైడ్స్' వివాహ ప్రదర్శన అమ్మకాలను చేపడుతోంది. వివాహ ఫ్యాషన్ అవసరాలు తీర్చే అతిపెద్ద హైలైఫ్ బ్రైడ్స్ ఎగ్జిబిషన్‌ను విజయవాడలోని నోవాటెల్ హోటల్లో మూడు రోజులు పాటు నిర్వహించనున్నట్లు హై లైఫ్ బైడ్స్ ప్రదర్శన ఆర్గనైజర్ డొమినిక్ తెలిపారు.. ఆగస్టు నెల నాలుగు ఐదు ఆరు తేదీల్లో ఈ ప్రదర్శనను నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఆదివారం నోవాటెల్ హోటల్లో ప్రముఖ మోడల్స్‌తో డిజైనర్ వెడ్డింగ్ వేర్‌ను హైలైట్ బ్రైడ్స్ ముందస్తు ప్రదర్శన కార్యక్రమం నిర్వహించారు.. నటులు జెన్నీ హనీ, శ్రీలేఖ, ఫ్యాషన్ ప్రియులు, మోడళ్లు ర్యాంపుపై హోయలు ఒలకబోసారు. ప్రారంభ బ్రోచర్‌ను విడుదల చేశారు. వివాహాలను వినూత్న రీతిలో కలకాలం మధురంగా నిలిచిపోవాలని కలలుకనే వారికి ఈ వస్త్ర, ఆభరణ ప్రదర్శన ఎంతగానో ఉపయోగపడుతుందని నిర్వాహకులు చెపుతున్నారు. మూడు రోజుల ప్రదర్శనలో ప్రత్యేకంగా వివాహ కలెక్షన్లు, అధునాతన వదువు మెచ్చే డ్రెస్సులు, వెడ్డింగ్ చీరలు, డిజైనర్ అప్రెరల్, బ్రైడల్ ఆభరణాలు, యాక్సరీలు అందుబాటులో ఉంటాయని హైలైఫ్ బ్రైడ్ ప్రదర్శన ఎండీ, సీఈవో డొమినిక్ అన్నారు.