High Court On TDR Bonds: మంత్రి కొట్టు సత్యనారాయణకు హైకోర్టు నోటీసులు..! టీడీఆర్‌ బాండ్ల జారీలో అక్రమాలపై.. - మంత్రి కొట్టు సత్యనారాయణకు హైకోర్టు నోటీసులు

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 26, 2023, 11:12 AM IST

High Court On TDR Bonds: పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పురపాలక సంఘంలో టీడీఆర్ బాండ్ల జారీలో అక్రమాలపై హైకోర్టు స్పందించింది. టీడీఆర్‌ బాండ్లు జారీ చేసిన అధికారులతోపాటు వాటిని పొందిన స్థల యజమానులైన మంత్రి కొట్టు సత్యనారాయణ తదితరులకు నోటీసులు జారీచేస్తూ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకుర్‌, జస్టిస్‌ ఏవీ శేషసాయితో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు ఇచ్చింది. తాడేపల్లిలోని కోడేరు-నల్లజర్ల రహదారి విస్తరణ నిమిత్తం రూ.18 కోట్ల విలువైన 3 వేల చ.మీ. స్థలాన్ని తొమ్మిది మంది నుంచి అధికారులు సేకరించారు. దాని ధరకు 4 రెట్ల విలువైన టీడీఆర్‌ బాండ్లను జారీ చేశారు. ఈ వ్యవహారంలో అధికారులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని ఆరోపిస్తూ తాడేపల్లిగూడెం టీడీపీ ఇన్‌ఛార్జి వలవల మల్లికార్జునరావు హైకోర్టులో పిల్‌ వేశారు. రహదారి విస్తరణ ముసుగులో నిబంధనలకు విరుద్ధంగా టీడీఆర్‌ బాండ్లు జారీచేశారని పిటిషనర్‌ తరఫున న్యాయవాది యెలిశెట్టి సోమరాజు వాదనలు వినిపించారు. అధికార పార్టీ నేతలు, భూ యజమానులతో పురపాలక కమిషనర్‌, టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు కుమ్మక్కయ్యారని ఆరోపించారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. టీడీఆర్‌ బాండ్ల అమలును నిలిపేయాలని అభ్యర్థించారు. వాదనలు విన్న న్యాయస్థానం స్థల యజమానులతో సహా సంబంధిత అధికారుల్ని.. కౌంటర్‌ దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను అక్టోబరు 4కు వాయిదా వేసింది.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.