high court On R5 Zone: ఆర్5 జోన్‌లో నిర్మాణాలు ఆపాలని దాఖలైన వ్యాజ్యంపై విచారణ వాయిదా - r5 zone petitions case
🎬 Watch Now: Feature Video
High Court On R5 Zone Petition: ఆర్5 జోన్‌లో ఇళ్ల నిర్మాణాన్ని సవాలు చేస్తూ రాజధాని ప్రాంత గ్రామాల సంక్షేమ సంఘాలు దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరిపింది. పిటిషన్లను వచ్చే సోమవారం త్రిసభ్య ధర్మాసనం విచారణ జరుపుతుందని న్యాయస్థానం తెలిపింది. సవరణ చట్టం, జీవో 45తో ముడిపడి ఉన్న పిటిషన్లను తమ ముందు విచారణకు ఉంచాలని త్రిసభ్య ధర్మాసనం ఉత్తర్వులిచ్చినట్లు గత విచారణలో రైతుల తరఫు సీనియర్ న్యాయవాది ఉన్నం మురళీధర్‌రావు తెలిపారు.
అదే విధంగా రాజధాని అమరావతిలో ఇతర ప్రాంతాల వారికి ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆర్5 జోన్‌లో పట్టాల పంపిణీని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై తదుపరి విచారణను కూడా ఈ నెల 17వ తేదీకి త్రిసభ్య ధర్మాసనం ముందు ఉంచాలని హైకోర్టు ఆదేశించింది. దీంతో ఇళ్ల స్థలాలు, ఇళ్ల నిర్మాణాలపై.. పిటిషన్లు 17 తేదీకి హైకోర్టులో విచారణకు రానున్నాయి.