High Court Judgment on SI Exams : అర్హత ఉన్న ప్రతి అభ్యర్థిని అనుమతించాలి.. ఎస్ఐ పరీక్షలపై హైకోర్టు కీలక తీర్పు - ఎస్ఐ పరీక్షలపై హైకోర్టు తీర్పు
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 13, 2023, 7:33 PM IST
High Court Judgment on SI Exams : పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు రేపు, ఎల్లుండి నిర్వహించే ఎస్‌ఐ పరీక్షలపై హైకోర్టు కీలక తీర్పు వెల్లడించింది. అర్హత ఉన్న ప్రతి అభ్యర్థినీ పరీక్షకు అనుమతించాలని ఆదేశాలు ఇచ్చింది. అర్హులైన ప్రతి అభ్యర్థికీ సమాచారం ఇవ్వాలని స్పష్టం చేసింది. ప్రక్రియ మొత్తం మూడు రోజుల్లో పూర్తి చేయాలని ఆదేశాలు ఇచ్చింది. ఎత్తు కొలిచే పరికరాల తప్పిదంతో విద్యార్థులు అర్హత కోల్పోవడంపై హైకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. 2019లో అర్హులైన అభ్యర్థులు 2023లో ఎలా అనర్హతకు గురవుతారని హైకోర్టు ప్రశ్నించింది.
అర్హత ఉన్నా అనర్హతకు గురి చేశారని కొందరు అభ్యర్థుల పిటిషన్ దాఖలు చేయగా.. వారి తరపున న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ హైకోర్టులో వాదనలు వినిపించారు. అనర్హతకు గురైన అభ్యర్థులకు మళ్లీ పరీక్ష నిర్వహించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అనర్హతకు గురైనవారిని శరీరదారుఢ్య పరీక్షలకు అనుమతించాలంది. ఎలక్ట్రానిక్ యంత్రంతో కాకుండా మ్యానువల్‌గా పరీక్షలు నిర్వహించాలని ఆదేశాలు ఇచ్చింది. అర్హులైన ప్రతి అభ్యర్థికీ సమాచారం ఇవ్వాలని, ప్రక్రియ మొత్తం మూడు రోజుల్లో పూర్తి చేయాలని హైకోర్టు స్పష్టం చేసింది.