రుషికొండ తవ్వకాలపై హైకోర్టులో విచారణ - డిసెంబర్ 27కు వాయిదా - High Court verdict on Rushikonda
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 29, 2023, 3:53 PM IST
High Court Adjourned the Hearing on Rushikonda Excavations: విశాఖ రుషికొండపై నిబంధనలకు వ్యతిరేకంగా తవ్వకాలు జరిపి.. భవన నిర్మాణాలు చేపడుతున్నారని దాఖలైన పిటీషన్లపై హైకోర్టు విచారణ జరిపింది. (High Court on Rushikonda Excavations) కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ శాఖ ఆధ్వర్యంలో నియమించిన కమిటీ డిసెంబర్ మొదటి వారంలో రుషి కొండపై జరుగుతున్న తవ్వకాలు, నిర్మాణాలను పరిశీలిస్తుందని కేంద్ర ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఐదుగురు సభ్యులతో ఓ బృందాన్ని ఏర్పాటు చేసిందని తెలిపారు.
అనుమతులకు మించి ఎంత మేర నిర్మాణాలు జరిగాయో వాటిపై ఎటువంటి చర్యలు తీసుకోవాలో నివేదికలో పేర్కొంటారని కోర్టుకు తెలిపారు. దీనితో తదుపరి విచారణను డిసెంబర్ 27 కు వాయిదా వేస్తూ న్యాయస్థానం ఆదేశాలు ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం పర్యావరణానికి విరుద్దంగా రుషికొండను ధ్వంసం చేసి అక్రమంగా అక్కడ భవన నిర్మాణాలపై హైకోర్టులో టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ, జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ దాఖలు చేశారు.