Heroine Kajal Agarwal in Chittoor: "సత్యభామను నేనే".. చిత్తూరులో సినీనటి కాజల్ సందడి - Kajal Aggarwal Latest Movie Updates
🎬 Watch Now: Feature Video
Heroine Kajal Agarwal in Chittoor: సినీనటి కాజల్ అగర్వాల్ చిత్తూరులో సందడి చేసింది. నగరంలోని ఓ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి ఆమె రాగా.. పెద్ద ఎత్తున అభిమానులు అక్కడికి చేరుకున్నారు. అభిమానుల కేరింతలు సందడితో షాపింగ్ మాల్ ప్రాంతమంతా ఉత్సహంతో నిండిపోయింది. చిత్తూరు నగరంలోని హైరోడ్డులోని నూతనంగా ఏర్పాటు చేసిన.. మాంగళ్య షాపింగ్‌మాల్‌ను సినీ నటి కాజల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో ముచ్చటించారు. ఆమె ప్రస్తుతం నటిస్తున్న చిత్ర విశేషాలను, రాబోయే సినిమాల గురించి మీడియాతో పంచుకున్నారు. బాలయ్యతో కలిసి ఓ సినిమాలో నటిస్తున్నట్లు వివరించారు. అంతేకాకుండా పోలీసుగా లీడ్రోల్లో.. ఆమె ఓ చిత్రంలో నటించనున్నట్లు వివరించారు. ఆ సినిమాలో తన పాత్ర పేరు సత్యభామ అని వెల్లడించారు. ఈ మధ్య కాలంలో సినిమాలు ఎందుకు తగ్గాయని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. తన కుమారుడిని దృష్టిలో ఉంచుకుని సినిమాలలో నటించలేదని వివరించారు. ఆమెను చూడటానికి పెద్ద ఎత్తున్న అభిమానులు అక్కడికి చేరుకోవటంతో వారిని అదుపు చేయటానికి పోలీసులకు కష్టంగా మారింది.