సంక్రాంతి హవా రద్దీగా మారిన రహదారులు - కీసర టోల్ ప్లాజా వద్ద కిక్కిరిసిన వాహనాలు - Keesara traffic
🎬 Watch Now: Feature Video


By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 12, 2024, 2:04 PM IST
|Updated : Jan 12, 2024, 2:30 PM IST
Heavy Traffic on Vijayawada-Hyderabad National Highway: తెలుగువారు ఎక్కుగా జరుపుకునే సంక్రాంతి పండగ రానే వచ్చింది. ఈ క్రమంలో ఆంధ్ర ప్రజలు ప్రపంచంలో ప్రదేశంలో ఉన్నా సరే సంక్రాంతికి తమ స్వస్థలాలకు చేరుకుంటారు. చిన్నా పెద్దా అంతా కలిసి పిండివంటలు, ఆటపాటలతో ఉత్సాహంగా కుటుంబంతో కలిసి సంక్రాంతి పండగను జరుపుకుంటారు.
ఈ నేపథ్యంలో సంక్రాంతి పండగ సందర్భంగా హైదరాబాద్ నుంచి వచ్చే వాహనాలతో విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారి రద్దీగా మారింది. ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం కీసర టోల్ ప్లాజా వద్ద వాహనాలు ఎక్కువ సమయం ఆగాల్సి వస్తుంది. ఈ రోజూ ఇప్పటికే 13 వేల వాహనాలు టోల్ గేట్ నుంచి విజయవాడ వైపు వెళ్తాయని సిబ్బంది అంచనా వేశారు. ఈ క్రమంలో టోల్ ప్లాజా వద్ద విజయవాడ వైపు వెళ్లేందుకు ఐదు లైన్లు ఏర్పాటు చేశారు. ఐదు లైన్లు ఉన్నప్పటికీ హైదరాబాద్ నుంచి వచ్చే వాహనాల సంఖ్య ఎక్కువగా ఉండటంతో టోల్గేట్ దాటడానికి ఎక్కువ సమయం పడుతుంది. పోలీసులు టోల్ గేట్ వద్దనే ఉండి ట్రాఫిక్ ను పర్యవేక్షిస్తున్నారు.