మాజీ మంత్రి నారాయణ పిటిషన్లపై హైకోర్టులో విచారణ ఈ నెల 15కు వాయిదా - Narayana Anticipatory Bail Petition news
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/01-11-2023/640-480-19912806-thumbnail-16x9-hc-hearing-on-narayana-bail-petition.jpg)
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 1, 2023, 3:06 PM IST
HC Hearing on Narayana Anticipatory Bail Petition: అమరావతి ఇన్నర్ రింగ్‌రోడ్డు కేసులో తనపై సీఐడీ నమోదు చేసిన కేసును కొట్టివేయాలని.. అలాగే, ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ.. మాజీ మంత్రి నారాయణ దాఖలు చేసిన పిటిషన్లపై రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం (హైకోర్ట్)లో విచారణ జరిగింది. విచారణలో భాగంగా వాదనలు వినిపించేందుకు మరికొంత సమయం కావాలని సీఐడి తరుపు న్యాయవాది కోర్టును కోరారు. దీంతో తదుపరి విచారణను న్యాయస్థానం.. ఈ నెల 15కు వాయిదా వేసింది.
High Court Hearing on CID Petition: మరోవైపు అసైన్డ్ భూముల కేసుకు సంబంధించి ఇటీవలే కేసును రీఓపెన్ చేయాలని కోరుతూ.. సీఐడి దాఖలు చేసిన పిటిషన్‌పై.. రాష్ట్ర హైకోర్టు విచారణ జరిపింది. అనంతరం తదుపరి విచారణను ఈ నెల 10వ తేదీకి వాయిదా వేసింది. గతంలో అసైన్డ్ భూములను విచారించిన ధర్మాసనం.. తీర్పును రిజర్వు చేసింది. అయితే, ఈ కేసులో ఇటీవల నలుగురు పేర్లు చేర్చామని, కేసును రీఓపెన్ చేయాలని సీఐడి అధికారులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈరోజు ఆ పిటిషన్‌పై న్యాయస్థానం విచారణ జరిపింది. తదుపరి విచారణను ఈనెల 10కి వాయిదా వేసింది.