అమరావతి అసైన్డ్ భూముల కేసు - సీఐడీ పిటిషన్‌పై హైకోర్టు విచారణ 22కు వాయిదా
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 10, 2023, 6:05 PM IST
HC Hearing CID petition in Amaravati Assigned Land Case: అమరావతి అసైన్డ్ భూముల కేసులో సీఐడీ దాఖలు చేసిన పిటిషన్‌పై.. రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం (హైకోర్టు) విచారణ జరిపింది. విచారణలో భాగంగా న్యాయవాదుల వాదోపవాదాలు విన్న న్యాయస్థానం..తదుపరి విచారణను ఈ నెల 22కు వాయిదా వేసింది.
HC Hearing on CID Petitions: అమరావతి ఇన్నర్ రింగ్‌రోడ్డు కేసులో తనపై సీఐడీ అధికారులు నమోదు చేసిన కేసును కొట్టివేయాలని.. అలాగే, ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ మాజీ మంత్రి నారాయణ హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు. ఈ మేరకు నారాయణ పిటిషన్‌పై ఇదివరకే విచారణ జరిపిన న్యాయస్థానం.. తీర్పును రిజర్వ్ చేసింది. ఈ నేపథ్యంలో నారాయణ వేసిన క్వాష్ పిటిషన్‌ను రీఓపెన్ చేయాలంటూ సీఐడీ పిటిషన్ వేసింది. ఈ కేసులో మరో నలుగురు పేర్లు చేర్చామని, కేసును రీఓపెన్ చేయాలని హైకోర్టును అభ్యర్థించింది. తాజాగా పూర్తిస్థాయిలో మళ్లీ విచారించాలని కోరుతూ మరో పిటిషన్ వేసింది. సీఐడీ దాఖలు చేసిన పిటిషన్లపై శుక్రవారం హైకోర్ట్ విచారణ జరిపింది. అనంతరం తదుపరి విచారణను ఈ నెల 22కు వాయిదా వేసింది.