ETV Bharat / state

పెద్దిరెడ్డి భూ దోపిడీ నిజమే - వెబ్‌ల్యాండ్‌ అడంగల్‌లోకి మంగళంపేట భూములు - PEDDIREDDY LAND GRABBING REPORT

వెలుగులోకి మాజీ మంత్రి పెద్దిరెడ్డి అక్రమ భూ కబ్జా - ప్రభుత్వానికి చిత్తూరు జిల్లా కలెక్టర్‌ నివేదిక

Peddireddy Land Grabbing Report
Peddireddy Land Grabbing Report (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 30, 2025, 8:40 AM IST

Updated : Jan 30, 2025, 9:59 AM IST

Peddireddy Land Grabbing Report : చిత్తూరు జిల్లా మంగళంపేట పరిధిలో మాజీమంత్రి, పుంగనూరు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూ ఆక్రమణలపై ఈటీవీ భారత్-ఈనాడు సంచలనాత్మక కథనాలపై ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. పెద్దిరెడ్డి కుటుంబ భూదందాపై అటవీ, రెవెన్యూ శాఖల అధికారులతో సంయుక్త కమిటీ ఏర్పాటు చేసింది. కమిటీలో సభ్యులెన చిత్తూరు కలెక్టర్‍ మంగళంపేట పరిధిలో పెద్దిరెడ్డి చెరబట్టినట్లు భావిస్తున్న 295, 296 సర్వే నెంబర్లలోని భూములకు సంబంధించిన పాత దస్త్రాలను పరిశీలించారు.

ప్రధాన కమిషనర్‌కి కలెక్టర్ నివేదిక : పులిచెర్ల తహశీల్దార్‌ను హుటాహుటిన చిత్తూరు కలెక్టరేట్‌కు పిలిపించారు. మంగళంపేట రెవెన్యూ గ్రామ పరిధిలోని దస్త్రాలను తెప్పించుకున్నారు. అటవీ భూముల్ని పెద్దిరెడ్డి కుటుంబం అక్రమంగా వెబ్‌ల్యాండ్‌ అడంగల్‌లోకి ఎక్కించుకున్నారని ప్రాథమిక విచారణలో తేలింది. ఈ మేరకు చిత్తూరు జిల్లా కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ భూ పరిపాలన ప్రధాన కమిషనర్‌కు నివేదిక సమర్పించారు.

అందులో మంగళంపేట రెవెన్యూ గ్రామానికి చెందిన ఫెయిర్‌ అడంగల్‌ రిజిస్టర్‌ ప్రకారం 295 సర్వే నంబర్​లో 17.69 ఎకరాలు, 296 సర్వే నంబర్​లో 6 ఎకరాలు ఉంది. ఆ మొత్తం భూమికి చల్లా కుప్పుస్వామయ్య పేరు మీద పట్టా ఉంది. ఎఫ్‌ఎంబీలో కూడా ఆ సర్వే నంబర్లలో అంతే భూమి ఉంది. సబ్‌ డివిజన్లు జరగలేదు. టెన్‌ వన్ రికార్డు ప్రకారం చూసినా భూమి విస్తీర్ణంలో ఎలాంటి మార్పు లేదు. మాన్యువల్‌ రికార్డ్‌ ఆఫ్‌ రైట్‌ -1కి వచ్చేసరికి చాలా మార్పులు జరిగాయి. దాని ప్రకారం 295 సర్వే నంబర్​లో దేశిరెడ్డి వెంకటరెడ్డి పేరుమీద 47.69 ఎకరాలు నమోదు చేశారు. మళ్లీ దానికి వృత్తం చుట్టి 37.69 ఎకరాలు అని రాశారు.

Peddireddy Land Grabs in Mangalampeta : 295/1బి1లో 0.80 ఎకరాలు, 295/1బి2లో 10.80 ఎకరాలు పి.ఇందిరమ్మ పేరు మీద ఎక్కించారు. సర్వే నంబర్ 295లో పెద్దిరెడ్డి లక్ష్మణరెడ్డి పేరు మీద 15 ఎకరాలు నమోదు చేశారు. అక్కడున్న చల్లా కుప్పుస్వామయ్య పేరుకు వృత్తం చుట్టి, లక్ష్మణరెడ్డి పేరు రాశారు. మిథున్‌రెడ్డి పేరు మీద 295/1సి1లో 10 ఎకరాలు, 295/1సి2లో మరో 11 ఎకరాలు నమోదు చేశారు. 296లో దేశిరెడ్డి వెంకటరెడ్డి పేరు మీద 28.06 ఎకరాలు నమోదైంది. 296/1లో వై.వేణుగోపాల్‌రెడ్డి పేరుకు వృత్తం చుట్టి పి.ఇందిరమ్మ పేరు రాశారు. ఇందులో 9.10 ఎకరాలు నమోదు చేశారు. 296/2లో చల్లా కుప్పుస్వామయ్య పేరుకు వృత్తం చుట్టి పి.ద్వారకానాథరెడ్డి పేరు రాశారు. ఇందులో 18.94 ఎకరాలు నమోదైంది.

మంగళంపేట గ్రామపటం ప్రకారం చూస్తే ఆ రెండు సర్వే నంబర్లలోని భూమి దట్టమైన రిజర్వ్ ఫారెస్ట్‌ మధ్యలో ఉంది. వాస్తవాలు నిగ్గు తేలాలంటే అటవీశాఖ అధికారులతో కలిసి లోతైన విచారణ జరపాలని పట్టాదారుల దగ్గరున్న పత్రాల్ని పరిశీలించాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ వారంలోనే ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంయుక్త కమిటీలోని అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలించి తుది నివేదిక సమర్పించే అవకాశం ఉంది.

పెద్దిరెడ్డి అటవీ భూముల ఆక్రమణలపై ప్రభుత్వం సీరియస్ - విచారణకు కమిటీ ఏర్పాటు

అటవీ ప్రాంతంలో మాజీ అటవీశాఖ మంత్రిగారి అక్రమ సామ్రాజ్యం-చూసేద్దామా?

Last Updated : Jan 30, 2025, 9:59 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.