నేను రాసే ప్రతి పాట మా అమ్మకు అర్థం కావాలి - అదే నా కొరిక: చంద్రబోస్ - విజయనగరం తాజా వార్తలు
🎬 Watch Now: Feature Video


By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 4, 2023, 4:00 PM IST
Gurajada Award to Lyricist Chandrabose In Vizianagaram : నేను రాసే ప్రతి పాట మా అమ్మకు అర్థం కావాలి, అదే నా కొరిక, మా అమ్మకు అర్థమైందంటే అది అఖిల లోకాలకు అర్థమవుతోందని ప్రముఖ సినీ గేయ రచయిత, ఆస్కార్ అవార్డు గ్రహీత చంద్రబోస్ అన్నారు. ఆదివారం విజయనగరంలోని ఆనందగజపతి ఆడిటోరియంలో గురజాడ సాంస్కృతిక సమాఖ్య గురజాడ విశిష్ట పురస్కారంతో చంద్రబోస్‌ను సత్కరించింది. ఈ సందర్భంగా చంద్రబోస్ మాట్లాడుతూ నా పాటలన్నీ చాలా చిన్నచిన్న మాటలతో, సరళమైన పదాలతో తేలికగా, కమ్మగా, తీయగా ఉండే విధంగా రాస్తానన్నారు. ఇవన్నీ ఆత్రేయ, గురజాడ కన్యాశుల్కం నుంచి వచ్చినవేనని పేర్కొన్నారు.
గురజాడ వారిలో నాకు నచ్చిన అంశం వాడుక భాషలో రాయడం అని ఆయన అన్నారు. నా పాటల్లో నేను వాడే పదాలు వాడుక భాషేనని తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన హైకోర్టు న్యాయమూర్తి దుర్గాప్రసాదరావు, సమాఖ్య ప్రధాన కార్యదర్శి కాపుగంటి ప్రకాష్, తమ్మన్నశెట్టి తదితరులు ఈ పురస్కారాన్ని చంద్రబోస్‌కు అందజేశారు.