దారిమధ్యలో నిలిచిపోయిన 'తిరుపతి' రైలు - రెండు గంటల పాటు ప్రయాణికుల అవస్థలు - రైలు నిలిచిపోవటంతో ప్రయాణికుల అవస్థలు

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 20, 2023, 12:40 PM IST

Guntakallu to Tirupati Passenger Train Stalled: గుంతకల్లు నుంచి తిరుపతి వెళ్తున్న ప్యాసింజర్‌ రైలు సాంకేతిక లోపంతో నిలిచిపోయింది. అనంతపురం జిల్లా గుంతకల్లు మండలం ఇమాంపురం రైల్వే స్టేషన్‌లో రెండు గంటలపాటు ఆగిపోయింది. ఇంజిన్‌లో సాంకేతిక లోపం తలెత్తటంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. 

Passengers Facing Problems due to Technical Fault in Train Engine: సుదూర ప్రాంతాలకు వెళ్లే విద్యార్థులు, ప్రయాణికులు అవస్థలు పడ్డారు. సమాచారం అందుకున్న రైల్వే శాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని మరమ్మతులు చేశారు. అనంతరం మరో రైలు ఇంజిన్‌ సాయంతో ప్రయాణికులను అక్కడి నుంచి తరలించారు.

Two Committed Suicide After Being Hit by a Train: ఇదిలా ఉండగా.. తిరుపతి జిల్లా గూడూరు గాంధీనగర్ సమీపంలో ఇద్దరు ఆత్మహత్యకు పాల్పడ్డారు. రైలు కిందపడి యువతి, యువకుడు సూసైడ్(Young Woman and Young Man Committed Suicide) చేసుకున్నారు. సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. ఆత్మహత్యకు గల కారణాలపై విచారణ చేపట్టారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.