తెగిపోయిన హుక్ - గుండ్లకమ్మ ప్రాజెక్టులో స్టాప్‌లాక్ ఏర్పాటు ప్రయత్నాలు విఫలం - కొట్టుకుపోయిన గుండ్లకమ్మ ప్రాజెక్టు గేటు
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 9, 2023, 10:06 PM IST
Gundlakamma Project Stoplock Set up Attempt Failed: గుండ్లకమ్మ ప్రాజెక్టులో స్టాప్ లాక్ ఏర్పాటు ప్రయత్నం విఫలమైంది. శుక్రవారం రాత్రి గుండ్లకమ్మ రిజర్వాయర్ స్పిల్ వే రెగ్యులేటర్ కు సంబంధించిన గేటు కొట్టుకుపోయిన విషయం తెలిసిందే. నీటి వృథాను కట్టిడి చేయడానికి స్టాప్ లాక్ ఏర్పాటు చేసేందుకు అధికారులు చేసిన ప్రయత్నాలు విఫలం అయ్యాయి. స్టాప్ లాక్ ఏర్పాటు చేస్తుండగా హుక్ తెగి నీటిలో పడిపోయింది.
స్టాప్ లాక్ ఏర్పాటుకు అధికారులు ఉదయం నుంచి తీవ్రంగా శ్రమించారు. స్టాప్ లాక్ గేటును పైనుంచి కిందకు దింపే ప్రక్రియలో క్రేన్ సరిగా పనిచేయకపోవడం, విద్యుత్తు సరఫరా పూర్తిస్థాయిలో లేకపోవడం వల్ల ఇబ్బంది పడ్డారు. అదే విధంగా స్టాప్ లాక్ కింద వరకు వచ్చి ఒక పక్కకు వాలిపోవడంతో దాన్ని సరి చేయడానికి తంటాలు పడ్డారు. జలాశయంలో నీటి ప్రవాహం ఎక్కువగా ఉంటడంతో అధికారులు మూడు గేట్లు ఎత్తారు. అయితే ఇక ఇప్పుడు స్టాప్‌లాక్ హుక్ తెగి నీటిలో పడిపోవడంతో అధికారులు ప్రత్యామ్నయ ప్రణాళికలు ఆలోచిస్తున్నారు. ఇప్పటికే చాలా నీరు వృథాగా సముద్రపాలైంది.