సీటిస్తేనే పార్టీలో ఉంటాననే వారు వెళ్లిపోవడమే మంచిది: మంత్రి గుడివాడ అమర్నాథ్
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 28, 2023, 10:33 PM IST
Gudivada Amarnath Comments on YSRCP Leaders Resignation : సీటిస్తేనే పార్టీలో ఉంటామనే నాయకులు పార్టీ వీడటమే మంచిదని మంత్రి గుడివాడ అమర్నాథ్ వ్యాఖ్యానించారు. తనకు సీటివ్వకపోయినా, పోటీ చేసే స్థానం మార్చినా పార్టీలోనే కొనసాగుతానని వెల్లడించారు. రాష్ట్రంలోని పేదవాళ్ల భవిష్యత్తు, సంక్షేమమే జగన్‌కు ముఖ్యమని దాని కోసమే సీట్ల మార్పిడి జరుగుతుందన్నారు. పార్టీకి వ్యతిరేకంగా పని చేసిన సిట్టింగ్ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసిన బలమైన నాయకత్వం వైఎస్సార్సీపీదని కితాబు ఇచ్చుకున్నారు.
గుడివాడ అమర్నాథ్ విశాఖలో మీడియాతో మాట్లాడుతూ, రాజకీయ, సామాజిక పరిస్థితులకు అనుగుణంగా మార్పులు చేర్పులు జరుగుతున్నాయని వీటిని ప్రజలు స్వాగతిస్తున్నారని అన్నారు. ఒకరు ఇద్దరు వెళ్లిపోతే పార్టీకి నష్టం జరుగుతుందనేది అమాయకత్వమేనని, ఖాళీ అయ్యేది జనసేన, టీడీపీలు మాత్రమేనని జోస్యం చెప్పారు. ఎమ్మెల్సీ వంశీ జనసేనలో చేరి రాజకీయంగా ఆత్మహత్య చేసుకున్నాడని వ్యాఖ్యానించిన మంత్రి, ప్రత్యక్ష రాజకీయాల కోసమే పార్టీ మరారు తప్ప జనసేన, పవన్ కల్యాణ్ నచ్చి వెళ్లినట్టు వంశీ చెప్పలేదని అన్నారు. షర్మిల కాంగ్రెస్లో చేరడం ఆమె వ్యక్తిగతమని, ప్రజాస్వామ్యంలో ఎవరు ఏ పార్టీలో అయినా చేరవచ్చునని ఆయన వ్యాఖ్యానించారు.