Grand Welcome to Lokesh in Gurazala Constituency: గురజాలలో నారా లోకేశ్.. యువగళం పాదయాత్రకు ఘన స్వాగతం - Lokesh in Gurazala constituency
🎬 Watch Now: Feature Video
Grand Welcome to Lokesh in Gurazala Constituency: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్ర గురజాల నియోజకవర్గంలో దుమ్మురేపుతోంది. అడుగడుగునా లోకేశ్‌కు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. లోకేశ్‌ను కలిసి.. అరాచక పాలనలో తమ సమస్యలను చెప్పుకునేందుకు భారీగా జనం పోటెత్తుతున్నారు. దీంతో రహదారులు అన్నీ కిక్కిరిసిపోతున్నాయి. 178వ రోజు పాదయాత్రను జూలకల్లు నుంచి లోకేశ్ ప్రారంభించారు. మాజీ ఎమ్మెల్యే యరపతినేని ఆధ్వర్యంలో.. 101 కలశాలతో మహిళలు, వేదపండితులు లోకేశ్‌కు స్వాగతం పలికారు. సంప్రదాయ డప్పులు, థింసా నృత్యాలు, కేరళ వాయిద్యాలు, ఒంటెలు, అశ్వాలతో నారా లోకేశ్‌కు అపూర్వ స్వాగతం లభించింది. బాణసంచా మోతలు, పార్టీ కార్యకర్తల కేరింతల నడుమ ఉత్సాహంగా యాత్ర కొనసాగుతోంది. దారి పొడవునా మహళలు.. లోకేశ్‌కు హారతులిస్తూ నీరాజనాలు పలుకుతున్నారు. ధరల పెరుగుదల, అరాచక పాలనతో అవస్థలు పడుతున్నామని గురజాల ప్రజలు లోకేశ్‌కు తమ కష్టాలు తెలిపారు. రాబోయే చంద్రన్న ప్రభుత్వం అందరి కష్టాలు తీరుస్తుందని భరోసానిస్తూ నారా లోకేశ్ ముందుకు సాగుతున్నారు.