కొండవీటి వాగు ఎత్తిపోతల పథకం మోటార్లు ఆన్ చేసి నీరు విడుదల - గుంటూరు జిల్లా కొండవీటి వాగు
🎬 Watch Now: Feature Video


By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 8, 2023, 4:36 PM IST
Government Respond In Spread The News In Etv Bharat: గుంటూరు జిల్లా తాడికొండ మండలంలో పంటమునకపై గురువారం ఈటీవీలో ప్రసారమైన కథనాలపై ప్రభుత్వం స్పందించింది. కొండవీటి వాగు ఎత్తిపోతల పథకం మోటార్లు ఆన్ చేయకపోవడం వల్ల గుంటూరు జిల్లా తాడికొండ పరిసర ప్రాంతాల్లో సుమారు 5వేల ఎకరాలలో పంటలు నీట మునిగాయి. దీంతో రైతుల ఆవేదనకు అద్దం పట్టేలా ఈటీవీ-భారత్ వరుస కథనాలు ఇచ్చింది. వర్షాకాలంలో కొండవీటి వాగు ఉద్ధృతికి పలు ప్రాంతాలు నీట మునుగుతున్నాయి.
Non Activation Of Motors In Kondaveeti Vagu Upliftment Scheme: కొండవీటి వాగు, పాల వాగులో అడ్డుగా ఉన్న తూటాకును అధికారులు తొలగింపు చేశారు. వాగులో ఉన్న తూటాకును తొలగించిన అధికారులు శుక్రవారం కొండవీటి వాగు ఎత్తిపోతల పథకం మోటార్లను ఆన్ చేశారు. దీంతో వాగు పరిసర ప్రాంతాల్లో నీటిని మొత్తం కృష్ణా నదిలోకి మళ్లించారు. దీంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ముందే ఈ పని చేసి ఉంటే తమ పంటలు చేతికి వచ్చేవని, మేము నష్టపోయే వాళ్లం కాదని రైతులు చెబుతున్నారు.