AP Govt bidding planning red sandal ఎర్రచందనం వేలానికి సిద్దమవుతున్న రాష్ట్రప్రభుత్వం.. - ఆంధ్రప్రదేశ్ తాజా రాజాకీయాలు
🎬 Watch Now: Feature Video
seshachalam red sandalwood : ఏపీ సర్కారు ఎర్రచందనం దుంగల వేలానికి సిద్దమవుతోంది. తిరుపతిలో 14 రాష్ట్రాలకు చెందిన పీసీసీఎఫ్లతో ఎర్రచందనం వేలం, రాష్ట్రాలకు వాటాలు, ధరల నిర్ణయంపై అధికారులు సమీక్ష సమావేశం నిర్వాహించారు. దేశ వ్యాప్తంగా నిల్వ ఉన్న పది వేల టన్నుల ఎర్ర చందనం దుంగలను అంతర్జాతీయ బిడ్డింగ్ లో విక్రయించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తిరుపతి సబ్ డిఎఫ్వో శ్రీనివాస రావు తెలిపారు. దేశ వ్యాప్తంగా పది వేల టన్నుల ఎర్ర చందనం నిల్వలు ఉన్నాయని వాటిని విక్రయించడం పై చర్చించేందుకు దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి పీపీఎఫ్లు, డైరెక్టర్లు, రెవెన్యూ డైరక్టరెట్ సిబ్బంది తిరుపతికి వచ్చినట్లు ఆయన చెప్పారు. మన రాష్ట్రంలో ఐదు వేల టన్నుల ఎర్ర చందనం, ఇతర రాష్ట్రాల్లో మరో ఐదు వేల టన్నుల ఎర్ర చందనం దుంగలు నిల్వాలు ఉన్నాయని ఆయన తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్ లో టన్ను విలువ 50 వేల నుంచి 80 వేలకు పలుకుతోందని వెల్లడించారు. ఎర్రచందనం ఏ రాష్ట్రాంలో పట్టుబడినా ఇక్కడికి తెప్పించి సింగిల్ నోడల్ ఏజెన్సీ ద్వారా టెండర్లు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు అటావీ శాఖ అధికారులు తెలిపారు. పలు రాష్ట్రాల్లో సీజ్ చేసిన సరుకును ఏపీకి తీసుకువచ్చి ఇక్కడ సింగిల్ ఏజెన్సీ ద్వారా వేలం వేస్తే మంచి ధర వస్తుంది అని, ఎర్ర చందంనాన్ని ఏ రాష్ట్రాంలో సీజ్ చేసినా దాని పై ఏపీకి హక్కులుంటాయి అని అధికారులు అన్నారు. 14 రాష్ట్రాల నుంచి వచ్చిన పీసీసీఎఫ్ లు, డైరెక్టర్లు ,రెవెన్యూ డైరక్టరెట్లు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.