గుత్తి రైల్వే స్టేషన్ 157వ వార్షికోత్సవం - వేడుక చేసుకున్న ఉద్యోగులు - అనంతపురం తాజా వార్తలు
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 6, 2023, 12:58 PM IST
Gooty Railway Station 157 Anniversary Celebration : అనంతపురం జిల్లా గుంతకల్లు డివిజన్ పరిధిలోని గుత్తి రైల్వే స్టేషన్లో అధికారులు, ఉద్యోగులు, కార్మికులు వేడుక చేసుకున్నారు.. గుత్తి రైల్వే స్టేషన్ ప్రారంభమై 157 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకొన్నారు. గుత్తి రైల్వే స్టేషన్ మేనేజర్ ఏ.సురేష్ బాబు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగాయి. ఈ సందర్భంగా సంబరాల్లో పాల్గొన్న అధికారులు ప్రసంగించారు. గుత్తి రైల్వే స్టేషన్ గొప్పతనం, చరిత్రను వివరించారు. సీనియర్ డీసీఎం. మనోజ్ కుమార్ మాట్లాడుతూ... బ్రిటిషర్స్ హయాంలో రైల్వే స్టేషన్ని స్థాపించారని. అప్పటి నుంచి దేశంలోని పలు ప్రాంతాలకు రైళ్ల రాకపోకలు విజయవంతంగా కొనసాగుతున్నాయన్నారు. గుత్తి రైల్వే స్టేషన్ను మరింత అభివృద్ధి బాటలో నడిపిస్తామని ఆయన తెలిపారు. అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకొన్నారు.
Gooty Railway Station Cake Cutting : ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రైల్వే సీనియర్ డీసీఎం మనోజ్ కుమార్, డీఎంఈ ప్రమోద్ కుమార్, రైల్వే వైద్యాధికారి వెంకటేశ్, ఏడీఎంఈ సుంకన్న, ఐపీఎఫ్ అనురాగ్ కుమార్, కమర్షియల్ ఇన్ స్పెక్టర్ హనూక్ కుమార్ తో పాటు, ఉద్యోగులు రిటైర్డ్ ఉద్యోగులు, యూనియన్ నాయకులు, పలువురు రైల్వే అధికారులు పాల్గొన్నారు.